రివ్యూ

రుచీ పచీలేని చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * చారుశీల
--
తారాగణం: రాజీవ్ కనకాల, రేష్మిగౌతమ్, జస్వంత్, బ్రహ్మానందం, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ తదితరులు
ఎడిటర్: నాగిరెడ్డి
నిర్మాతలు: వి సాగర్, జయశ్రీ అప్పారావు
సంగీతం: సుమన్ జపూడి
దర్శకత్వం: శ్రీనివాస్‌రెడ్డి ఉయ్యూరు
---
ఒక రచయిత రాసిన పాత్రలు అతని ముందుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తే, అదొక కామెడీ ట్రాక్! ఆ పాత్రలే సజీవంగా రచయిత ముందుకొచ్చి అభిమానిని ఆవహించినట్టు తమ డిమాండ్లతో నానా యాగీ చేస్తూ.. రచయితపై తిరగబడితే.. -అది చారుశీల. పాత చిత్రాల్లో రచయిత- అతను సృష్టించిన పాత్రల ట్రాక్‌తో కామెడీ పండించారు. ఇప్పుడు ఇదే వాసనతో హాలీవుడ్ రచయిత రాసిన ‘మిజైరి’ నవల ప్రేరణగా నచ్చినట్టు అల్లుకుని చారుశీల సృష్టించారు. అయితే, ఇందులో కొంచెం తేడా! పాత్రలు నేరుగా రచయిత ముందుకురాకుండా, ఆ పాత్రల అభిమాని రచయిత ముందుకొచ్చి హారర్ క్రైం థ్రిల్లర్ సృష్టిస్తూ భయపెట్టి చంపే ప్రయత్నం చేస్తుంది. అది కామెడీ అయితే, ఇది థ్రిల్లర్‌‘ట’!
కథేంటి?
తెలుగులో మంచి రచయితగా పేరున్న యార్లగడ్డ వీరేంద్రనాధ్ (రాజీవ్ కనకాల) రాసిన ప్రతి నవల సూపర్‌హిట్టే. అతనికి అభిమానులు కోకొల్లలు. అతన్నుండి కొత్త నవల ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తుంటారు అభిమానులు. అటువంటి వీరేంద్రనాధ్ ఎప్పుడు నవల రాసినా అరకు కొండలలో ఓ గెస్ట్‌హౌస్ తీసుకుని అక్కడ రాస్తుంటాడు. అలా ఓ నవల ముగించి ఇంటికి బయలుదేరిన రచయిత ప్రమాదానికి గురవుతాడు. ఆ ప్రమాదం నుంచి కాపాడిన జ్యోత్స్న (రేష్మిగౌతమ్) వీరేంద్రనాథ్‌కు వైద్య సహాయం అందిస్తుంది. అతనికి ఏమేంకావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. వీరేంద్రనాథ్ కొత్తగా రాసిన నవలను తానే మొదటి పాఠకురాలిగా చదవాలని ఆశిస్తుంది జ్యోత్స్న. అందుకు అతను కూడా ఒప్పుకుని నవలను చదవమని ఇస్తాడు. అది చదివినప్పటి నుంచి ఆమె ఆలోచనా విధానం మారిపోతుంది. నవలలోవున్న చారుశీల పాత్రను ఎందుకు చంపేశావంటూ? నానా యాగీ చేసి, అతన్ని చంపేందుకూ వెనుకాడదు. అభద్రతాభావంతో వున్న వీరేంద్రనాథ్ ఎప్పుడెప్పుడు అక్కడినుంచి వెళ్లిపోవాలా? అని అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. ఏ ప్రయత్నంలోనూ అతను విజయం సాధించలేకపోతాడు. కారణం, కాళ్లు రెండు నడవటానికి సహకరించకపోవడం. ఎప్పటికప్పుడు జ్యోత్స్న ఓవైపు రచయితను మెచ్చుకుంటూనే మరోవైపు సైకోలాగా మారి హింసిస్తూ ఉంటుంది. ఈ హింసకు కారణమేంటో కూడా అతనికి తెలియదు. కనిపించకుండా పోయిన రచయిత చనిపోయాడేమోనని మీడియా కథనాలు వస్తుంటాయి. అవి కూడా అతనికి చూపించి ఆనందపడుతుంది జ్యోత్స్న. ఇక నీకు చావే గతని, తన పాత్రను చంపావు కనుక నీవు చనిపోవాల్సిందేనని భయపెడుతూంటుంది జ్యోత్స్న. అటువంటి పరిస్థితిలోవున్న రచయిత వీరేంద్రనాథ్ ఎలా తనను తాను రక్షించుకున్నాడు? అనే కథనమే మిగతాది.
సినిమా మొదటి నుంచీ ఆసక్తికరంగానే తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. జ్యోత్స్న పాత్రను తీర్చిదిద్దిన విధానం మొదటి సగంలో బాగానే ఉంటుంది. ప్రేక్షకుడికి అసలు ఈమె ఎవరన్న అనుమానం వీరేంద్రనాథ్‌కు వచ్చినట్టే వస్తుంది. అతనికి తెలియకపోయినా ఫర్వాలేదు. ప్రేక్షకుడికి పూర్తి క్లారిటీ రావాలి కదా! ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ ప్రేక్షకుడికి అందదు. అసలు జ్యోత్స్న పాత్ర అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా ఆమె భర్త ఓ శాడిస్ట్ అని చూపిస్తూ, చివరికి భార్యను చంపే ప్రయత్నం చేస్తుండగా, తానే ముందుచూపుతో అతన్ని అంతమొందించి బయటపడింది అని చెప్పారు. ఓకె. అంతవరకూ బాగనే ఉంది. శాడిస్ట్ భర్తతో ఇన్నాళ్లూ వేగిన భార్య, తన అభిమాన రచయితతో ఇలాగే శాడిజంతో ప్రవర్తిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఓవైపు వీరాభిమానిని అంటూ, మరోవైపు నానా హింసపెట్టే పాత్రను ప్రేక్షకుడు కొత్తగానే రిసీవ్ చేసుకోగలడు. కానీ, ఎందుకు ఆమె అలా ప్రవర్తిస్తుంది అన్న విషయం మాత్రం దర్శకుడు పూర్తిగా చెప్పలేదు. ఇక నటీనటులలో రాజీవ్, రేష్మి ఆ పాత్రలకు తాము తప్ప మరొకరు చేయలేరన్నట్టుగా నటించారు. చిత్రీకరణ విధానం, కెమెరా పనితనం, సంగీతం అన్నీ ఓకె. కానీ క్లారిటీ అనేదే లేకపోవడం సినిమాకు మైనస్. రేష్మి ఉన్నందుకు జబర్దస్త్ పద్ధతిలో గ్రీకువీరుడు, మేరానామ్ షీలా, ఎంతవారుగానీ వేదాంతులైనగాని, సినిమా సూపిస్తమామ అన్న పాటలకు పేరడీలు పెట్టి డాన్సులు చేయించారు. ఇక బ్రహ్మానందం కామెడీ ట్రాక్ శుద్ధ దండగ. సీరియస్‌గా సాగుతున్న చిత్రంలో పంటికింద రాళ్లలా సన్నివేశాలు వచ్చాయి. కేవలం కామెడీ ట్రాక్ కోసమే అనుకుంటే ఈ జోనర్‌కు ఆ సన్నివేశాలే అవసరం లేదు. దర్శకత్వపరంగా ఓకె అనిపించినా, ప్రధానమైన ఉప్పు లేకపోవడంతో చారు రుచి చప్పగానే ఉంది.

-తిలక్