రివ్యూ

నిర్భయంగా.. నిస్సంకోచంగా..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** పింక్
--
తారాగణం: అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను, కీర్తి కల్హారి, ఆండ్రియా తరియాంగ్, పియూష్ మిశ్రా తదితరులు
దర్శకత్వం: అనిరుధ్‌రాయ్ చౌదరి
---
ఇదొక రగిలే అగ్నిజ్వాల. సమాజంలో మహిళల పట్ల ప్రతీ క్షణం సాగుతోన్న మారణహోమం. వ్యవస్థ చిలకరిస్తున్న జుగుప్సాకర దుస్థితి. ఎనే్నళ్లయినా ఎన్ని యుగాలైనా.. మారని దైన్యస్థితి. చట్టాలెన్ని ఉన్నా.. మహిళలపై అరాచక శక్తుల విజృంభణ. తవ్వే కొద్దీ అంతుచిక్కని దొరకని న్యాయ వ్యవస్థ చిక్కుముడులు. ఒక నిర్భయ చట్టం.. చట్టం ఏదైనా.. మళ్లీమళ్లీ కఠిన ప్రశ్నల తెరచాటున సమాధి అవుతూనే ఉందనడానికి ఎన్నో ఉదాహరణలు. ఆ వాస్తవిక సంఘటనల కఠిన శిలల్నీ, నేటి వ్యవస్థని పట్టి పీడిస్తున్న ఒకానొక ‘జ్వాల’నీ తెరకెక్కించిందీ ‘పింక్’.
ఏ పేపర్ తిరగేసినా.. ఏ ఛానెల్ బటన్ నొక్కినా.. కనీకనిపించని -హృదయ విదారక సంఘటనల సమాహారం ఈ చిత్రం. మహిళల పట్ల జరుగుతున్న అరాచక కృత్యాలనూ.. వ్యవస్థకి తెలీని ఎన్నో వాస్తవాస్తవాలను గుదిగుచ్చి గుండె తడిని చెమర్చే ప్రయత్నంలో ‘పింక్’ సమాజాన్ని ప్రశ్నించింది కూడా. ‘రేప్’ జరగటానికి ఇదీ కారణమంటూ -నేటి తరం అమ్మాయిలు వేస్తున్న కాస్ట్యూమ్స్‌ని ఉదాహరణగా చూపిస్తూండటాన్ని వేలెత్తి చూపించి యధార్థాన్ని వెలికితీసింది. ఓ అమ్మాయి/ మహిళ వృత్తిరీత్యా అర్ధరాత్రి ‘క్యాబ్’లో రావటాన్నీ.. దాన్ని అవకాశంగా తీసుకొన్న కుర్రాళ్లు జరుపుతున్న అత్యాచారాల మాటున ప్రభుత్వాలు వెలగబెడుతున్న అవకాశవాదాన్ని ప్రశ్నిస్తుందీ చిత్రం. ఒంటరి ఆడది కనిపిస్తే.. అమానుషంగా ప్రవర్తించాలన్న కుర్రాళ్ల ఆలోచనా విధానాన్ని ఎండగడుతూందీ చిత్రం. ఆఖరికి బస్సుల్లోనూ రైళ్లలోనూ -‘టచ్’ చేయాలన్న కుత్సిక మనస్తత్వాన్నీ ప్రతిబింబిస్తుందీ చిత్రం.
‘పింక్’ ముగ్గురమ్మాయిల కథ. మినాల్ (తాప్సీ పన్ను) ఈవెంట్ మేనేజర్. అర్ధరాత్రి అపరాత్రీ ఒంటరిగా ఇంటికి చేర్చే ఉద్యోగం. ఫలక్ (కీర్తి కల్హారి) కార్పొరేట్ వృత్తి. ఆండ్రియా ‘నార్త్-ఈస్ట్’ నుంచీ వచ్చిన అమ్మాయి. సౌత్ దిల్లీలోని చిన్న లొకాలిటీలో ‘్ఫ్లట్’ని షేర్ చేసుకొని జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. రాజకీయ పరపతితో కన్నూమిన్నూ కానని రాజ్‌వీర్, అతని స్నేహ బృందం డంపీ, విశ్వ, మరొకడు. ఓ అర్ధరాత్రి -మినాల్ జీవితాన్ని అర్థాంతరంగా కాలరాచిన రేపటి తరానికి ప్రతినిధులు. ‘గ్యాంగ్ రేప్’కి గురైన అమ్మాయిల వేదనాభరిత జీవితం ఎలా ఉంటుందో? పోలీస్ వ్యవస్థ వేసే ప్రశ్నలు ఏ తీరున మళ్లీ మళ్ళీ గుచ్చిగుచ్చి క్షోభను పెడతాయో? రాజకీయ వ్యవస్థ ‘నేరస్థుడ్ని’ తప్పించేందుకు ఏవిధంగా విజృంభించిందో? కేసుని తారుమారు చేసే ప్రక్రియలో ‘అక్రమ’ మార్గాల్ని అనే్వషిస్తుందో? ఇలా.. ఎనె్నన్నో ప్రశ్నలు.
ఇదొక కథగా చూట్టం కాదు -మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. యువత ఎన్ని వికృత చేష్టల్ని చేస్తోందో? ఎన్ని వెర్రితలలు వేస్తోందో? ఆలోచించాల్సిన సంగతి. కానె్సప్ట్ ఓవిధంగా మనసుని తొలిచేస్తుంది. న్యాయ వ్యవస్థపై.. పోలీసు వ్యవస్థపై.. చివరికి ఈ సమాజంపై తిరుగుబాటు చేయాలని ఒక్క క్షణం ఆలోచనల సుడిగుండాల్లోకి నెట్టేస్తుంది. నటనాపరంగా -ఎవరినీ ప్రత్యేకించి ఉదహరించాల్సిన అవసరం లేదు. ఆయా పాత్రల్లో వొదిగిపోయి.. ఆయా సన్నివేశాల్లో జీవించి కన్నీళ్లు పెట్టించారు. తాప్సీకి ఇదొక ఛాలెంజింగ్ రోల్. ఆ మాటకొస్తే- ఫలానా నటి/ నటుడు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పటం సిల్లీ పాయింట్.

-బిఎనే్క