రివ్యూ

బ్యాండ్ ముంబయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * భాంజో
***
తారాగణం: రితేష్ దేశ్‌ముఖ్, నర్గీస్ ఫక్రి, ధర్మేష్, ఆదిత్యకుమార్, రాజా మీనన్ సంగీతం: విశాల్-శంకర్
కథ: కపిల్ సావంత్,
నిఖిల్ మల్హోత్రా, రవి జాదవ్
నిర్మాత: కృషిక లుల్లా
దర్శకత్వం: రవి జాదవ్
**
ముంబైలోని మురికివాడల్లోకీ.. వీధి కొట్లాటల్లోకీ - గణేష్ చతుర్థి ఉత్సవాల్లోకీ.. నవరాత్రి సంబరాల్లోకీ- ఇలా ఒకటేమిటి? ఈ కథ అందించని అంశం లేదు. మనసుండీ.. కథ లోలోతుల్లోకీ.. వాస్తవిక సంఘటనల్లోకీ.. వెళ్లి అర్థం చేసుకోగలిగితే - ‘్భంజో’ ఓ చక్కటి దృశ్య కావ్యమై.. మనసు తెరపై అలలు అలలుగా కమ్మటి రాగాన్ని పలికి ఉండేదేమో?! కథకీ.. సగటు ప్రేక్షకుడికి ఆలోచనకీ మధ్య ఉన్న పల్చటి తెర గందరగోళాన్ని సృష్టిస్తే.. ఇక ఇంతే సంగతులు. హడావిడిగా.. ఉవ్వెత్తున ఎగసిపడే సందిగ్ధ తరంగాల్లోనూ చిక్కుకొని.. ఏం చేయాలో ఏ తీరం చేరాలో తెలీక కొట్టుమిట్టాడే నావ చందం.
ఇదొక వీధి పాటగాడి కథ అని సింపుల్‌గా చెప్పేస్తే- ప్రేక్షకులు ఒప్పుకోరని అనుకున్నారేమో? ముంబైలోని రోజువారీ సమస్యలన్నింటినీ తలకెత్తుకొని.. వాటర్ ట్యాంక్ కొట్లాటల్నీ.. బిల్డర్ మాఫియా - లోకల్ లీడర్ల అరాచకాన్నీ.. ప్రాంతాల వారీ దందానీ - ఇలా కథని ఎటేటో తిప్పి.. అనేకానేక మలుపుల వద్ద ఆగీ.. ఈ నేపథ్యం నుంచీ వచ్చిన ఒకానొక ‘పాటగాడు’ ఎంత పై స్థాయికి చేరుకొన్నాడు అన్నది చెప్పాలని ప్రయత్నించి.. ఒక క్లారిటీని తేలేక పోయాడు కథకుడు.
కథ - నంద కిశోర్ అలియాస్ తారత్ భాయ్ (రితీష్ దేశ్‌ముఖ్) ముంబై వీధుల్లో పండుగలకీ పబ్బాలకీ.. పెళ్లిళ్లకీ పేరంటాలకీ - తనదైన స్టైల్‌లో పాటలు పాడే సింగర్. ‘్భంజో’ బాండ్‌గా అతడూ అతని బృందం అక్కడి వారికి చిరపరిచితుడు. ఈ భాంజో టీం లేందే అక్కడ గణేష్ చతుర్థి కానీ.. దసరా ఉత్సవాలు కానీ అంగుళం ముందుకి జరగవు. అంతగా పాతుకుపోయాడు తారత్. చేతుల్లో ఏ పరికరం ఉంటే- దాంతోనే అద్భుతమైన సంగీతం పలికించి.. ప్రేక్షకుల్ని ఉర్రూత లూగిస్తాడు. ఆ బృందం వద్ద ఉండేవన్నీ.. చిన్నాచితకా సంగీత వాయిద్యాలే. మరోవైపు - క్రిష్ (నర్గీస్ ఫక్రి) న్యూయార్క్ లగ్జరీ లైఫ్‌లో మెలిగే ఆధునిక యువతి. సంగీతం అంటే ప్రాణం. కెరీర్‌ని సంగీత మయం చేసుకోవాలని ఆమె చిరకాల వాంఛ. ఒకానొక సందర్భంలో తారత్ సంగీత బృందాన్ని చూసి.. ఆ సంగీతం పట్ల మనసు పారేసుకుంటుంది. వీధుల్లో అల్లరిచిల్లరిగా తిరుగుతూ.. అంతగా సంగీత పరిజ్ఞానం లేకున్నప్పటికీ.. శ్రోతల్ని మైమరపించే మంత్రం తెలిసిన వారికి అధునాతన సంగీతాన్ని పరిచయం చేయాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్ - విత్ లవ్.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి. చక్కటి కథ. కానీ- నేల విడిచి సాము చేసేసరికి.. అసలు కథలో ఏం చెప్పదలచుకున్నదీ అర్థంకాక.. ముంబై చీకటి తెరల మాటున జరుగుతున్న వాస్తవాన్ని ఒకవైపు చూపించినట్టైంది. దీంతో నంద కిశోర్ కథ అడ్డం తిరిగింది. ప్రేమకథ ‘వాటర్ ట్యాంక్’ కొట్లాట దగ్గర ఆగిపోయిందనిపిస్తుంది. గణేష్ ఉత్సవాల గిరాకీ కోసం ప్రత్యర్థి వర్గంతో ప్రత్యక్ష పరోక్ష దాడికి దిగి.. ఆఖరికి డబ్బు గుంజుకొని.. పీకల్దాకా తాగి - స్టెప్స్ వేసినట్టయింది. అవటానికి ఇదొక మల్టీప్లెక్స్ సినిమానేగానీ.. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించి.. ఆనక - ప్రేక్షకుల్తోపాటు దర్శకుడు కూడా చోద్యం చూస్తున్నాడనిపిస్తుంది.
నటనాపరంగా - రితీష్ దేశ్‌ముఖ్, నర్గీస్ ఫక్రి - చక్కటి నటనను ప్రదర్శించారు. మాస్ మసాలా హీరోలా రితీష్.. న్యూయార్క్ అమ్మాయిగా నర్గీస్ ఎవరినీ ఎన్నిక పెట్టటానికి లేదు. మిగతా వారంతా వారివారి పరిధి మేరకు నటించారు. ముంబై నేపథ్యాన్ని చూడాలనుకొంటే- భాంజో’ చక్కటి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తూనే.. కళ్లనీళ్లు పెట్టిస్తుంది. కానీ- మల్టీప్లెక్స్ ప్రేమ కథని చూడాలనిపించినా.. అద్భుతమైన కథని ఎక్స్‌పెక్ట్ చేసినా.. ఎవరూ చేయగలిగిందేమీ లేదు.

-బిఎనే్క