రివ్యూ

కొత్త ఒక చెత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *కొత్తకొత్తగా ఉన్నది..

తారాగణం: సమర్ తౌట, అక్షిత, కిమయా, ట్వింకిల్, తనికెళ్ల భరణి, దువ్వాసి మోహన్ తదితరులు
సంగీతం: వంశీ
నిర్మాతలు: పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్
దర్శకత్వం: గుండేటి సతీష్‌కుమార్

కథని -కథలా చెబితే కలిగే థ్రిల్ వేరు. కథని -దృశ్యంగా చూపిస్తే పుట్టుకొచ్చే ఆనందం వేరు. ఏ పద్ధతి ఎంచుకున్నా చెప్పే రీతిలో కొత్తదనం ఉంటే -ఎంజాయ్ చేయడానికి సిద్ధపడి వచ్చిన ప్రేక్షకుడు ‘్ఫర్మాట్’కు కనెక్టవుతాడు. కథలోనే ఉండి.. ఊహాలోకాల్లో విహరిస్తాడు. పాయింట్ పాతదే కావొచ్చు. స్క్రీన్‌ప్లేతో అద్భుతాన్ని సృష్టిస్తే -స్క్రీన్ ముందున్న ప్రేక్షకుడు ఆనందిస్తాడని ఎన్నో చిన్న సినిమాలు రుజువు చేశాయి. వౌత్‌టాక్‌లో ‘మంచి సినిమా’ టాగ్‌లైన్ వేసేసి పదిమందికీ ప్రచారం చేస్తాడనీ నిరూపించుకున్నాయి. నిజానికి -బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడగలిగిన చిన్న సినిమాల బేస్ పాయింట్ ఇదే. కొత్తకొత్తగా ఉన్నది -అంటూ హిట్ సాంగ్ ఫస్ట్‌వర్డ్స్ టైటిల్ చేసుకుని వచ్చిన చిన్న సినిమా హిట్ కోవకు చేరలేకపోయంది.
రాకీ (సమర్ తౌట), నందు (అక్షిత)లు ఇరుగు పొరుగు కుటుంబాల్లోని బాల్య స్నేహితులు. కుటుంబ యజమానుల్లాగే -వీళ్లకూ ఒకరంటే ఒకరికిష్టం. అనివార్య కారణాలతో రెండు కుటుంబాలు విడిపోయి వేర్వేరు ప్రాంతాల్లో సెటిలవుతాయి. చిన్నప్పుడే విడిపోయిన రాకీ, నందులు ‘ప్రేమ’ను బతికించుకుంటూ ఎదుగుతారు. ఒకరికోసం ఒకరు వెతుకుతుంటారు. వీధుల్లో వెతుకులాటలు, కలల్లో ప్రేమపాటలతో పుణ్యకాలం పూరె్తైన తరువాత -ఒకరికొకరు తారసపడతారు. చిన్నచిన్న ఇబ్బందులు అధిగమించి ఇద్దరిమధ్యా ‘బంధం’ బలపడుతున్న సమయంలో క్లారిటీలేని రాకేష్ ఫ్లాష్‌బ్యాక్ ‘రిలేషన్’, నందులో అనుమానాలు రేకెత్తిస్తుంది. అది బలపడి భరించలేని స్థితికి చేరడంతో ఓ ఫంక్షన్‌లో రాకీని పొడిచేస్తుంది నందు. ఆమె ఎందుకలా ప్రవర్తించింది? హత్యాయత్నానికి గరై ఆస్పత్రి పాలైన రాకీ బతికాడా? అసలు రాకీ ఫ్లాష్‌బ్యాక్‌లోని భయంకరమైన నిజమేమిటి? నందులో అనుమానాలు పొడసూపేందుకు -‘గాడ్స్ స్క్రీన్ ప్లే ఏమిటన్నది మిగతా కథ.
లవ్‌లో మిస్ అండర్‌స్టాండింగ్స్ బేస్ చేసుకుని చాలా తెలుగు సినిమాలే వచ్చాయి. పాయింట్‌ను సూటిగా డిస్కస్ చేసిన సినిమాలు హిట్టుకొట్టాయి. ఫ్రేమ్‌దాటి బయటిపోయిన సినిమాలు బోల్తాపడ్డాయి. రెండో కోవలోనే ‘కొత్తకొత్తగా ఉన్నది’ కూడా నడిచింది. దర్శకుడు ఏదో కథనుకుని, ఏవేవో సీన్లు రాసుకుని, ఇంకేదో షూట్‌చేసి, కత్తెరల తరువాత అర్థంకానిదేదో చూపించిన ఫీలింగ్ కలిగింది. విధి ఆడిన వింత నాటకం -నానుడిని ‘గాడ్స్ స్క్రీన్‌ప్లే’ అంటూ పదేపదే ప్రస్తావించి తను రాసుకోవాల్సిన అసలు స్క్రీన్‌ప్లే గాలికొదిలేశాడు దర్శకుడు. దర్శకుడి వైఫల్యానికి మిగతా విభాగాలూ శక్తిమేర సహకరించాయి. రాంగ్ కాస్టింగ్, రాంగ్ టెక్నీషియన్ల పనితనంతో సినిమా సీరియల్‌ను మించిపోయింది. చెప్పదలచుకున్న పాయింట్‌లో స్పష్టత లోపించడంతో -దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థంగాక ప్రేక్షకుడు బోర్ ఫీలయ్యాడు. ప్రధానంగా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ పెద్ద మైనస్. హీరో హీరోయిన్లకు ఉండాల్సిన అట్రాక్షన్ కనీసం లేకపోవడం, సన్నివేశానికి తగిన ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించలేకపోవడం, ప్రేమ సన్నివేశాల్లో ఉండాల్సిన కనీస మెరుపులేక సినిమా మొత్తం నీరసంగా సాగుతుంది.
అసందర్భానుసారం పాటలు వచ్చేసినా -సాహిత్యం బావుందనుకునే సమయానికి సంగీతం పూర్తిగా మింగేసింది. అక్కడక్కడా సంభాషణల్లో మెరుపు కనిపించినా, ఆర్టిస్టుల నీరసం ముఖాలు డైలాగుల్లోని పసను మింగేశాయి. ‘రిలేషన్ బలంగా ఎదగాలంటే ఎప్పుడూ ప్రేమ అనే నీళ్లు పోస్తుండాలి. అంతేగాని ఎదిగిందో లేదో చూడ్డానికి వేళ్లు పీకి చూడకూడదు’లాంటి తాత్విక సంభాషణలు అక్కడక్కడా కాస్త ఉపశమనం. ఎడిటింగ్‌లో పదును లేదు. ఫొటోగ్రఫీలో పసలేదు. ముందు -నిర్మాణాత్మక విలువల్లో బలం లేదు. మొత్తంగా -టైటిల్లో పెట్టుకున్న కొత్తదనం తప్ప, సినిమా మొత్తం పాత చింతకాయ పచ్చడే.

-‘వి’