రివ్యూ

నకిలీ వైద్యులపై ఎక్స్‌రే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు **నందిని నర్సింగ్‌హోమ్

తారాగణం: నవీన్‌విజయ్‌కృష్ణ, నిత్య, శ్రావ్య, సప్తగిరి, వెనె్నల కిశోర్ తదితరులు.
సంగీతం: అచ్చు
కెమెరా: దాశరథి శివేంద్ర
నిర్మాతలు: రాధాకృష్ణ, భిక్షమయ్య
దర్శకత్వం: పివి గిరి
**
వైద్యుడంటే దేవుడి తర్వాత పూజించదగినవాడు. అతనికి తన పర బేధం ఉండదు. బాధతో వచ్చే ఎవరికైనా స్వాంతన ఇవ్వడం అతని ధర్మం. అదంతా గతం. ఇప్పుడు వైద్యం వ్యాపారం. ఎంత దొరికితే ఆస్పత్రులు అంతా దండుకుంటున్నాయ. నెలకు ఇన్ని కేసులు చూసి, ఇంత బిల్లు పేషంట్లచేత కట్టించాలని వైద్యులకు కండిషన్ పెట్టి మరీ ఉద్యోగాలిచ్చే ఆస్పత్రులు వెలిశాయ. ఇక సామాన్య మానవుడి ఆరోగ్యం గురించి ఆలోచించేదెవరు? రోగంతో వచ్చిన పేషెంట్‌కు బ్రెయిన్ డెడ్ చేసి, అవసరమైన అవయవాలను అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్న ఆస్పత్రుల గుట్టుమట్లు విప్పే ప్రయత్నమే -నందిన నర్సింగ్‌హోమ్ కథ.
చందు (నవీన్ విజయ్‌కృష్ణ) ఎంబిఏ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నపుడు, అతని స్నేహితుడు (షకలక శంకర్) ఏకంగా నందిని నర్సింగ్‌హోమ్‌లో డాక్టర్‌గా ఉద్యోగమిప్పిస్తాడు. నర్సింగ్‌హోమ్‌లో ఇలా చేరిన నకిలీ డాక్టర్ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఓ చైన్ స్నాచర్ కోమాలో ఉన్నట్టు నటించడం, రోగం లేకుండా ఆస్పత్రిలో చేరి బ్రోతల్ వ్యాపారానికి వేదికగా వాడుకునే పాత్ర, కంపౌండర్‌గా చేరిసన హీరో స్నేహితుడి కామెడీతో తొలి భాగాన్ని నింపేశారు. పనిలో పనిగా ఆస్పత్రి ఓనర్ నందిని (నిత్య) చందుతో ప్రేమలో పడుతుంది. గతంలో అమూల్య (శ్రావ్య) ప్రేమలో ఓడిపోయిన చందు, నందినిని ప్రేమించడానికి అనుమానపడుతుంటాడు. ఈ దశలో నర్సింగ్‌హోమ్‌లో ఏదో తెలియని మిస్టరీ ఉందని, అక్కడ దయ్యం తిరుగుతోందన్న పుకార్లూ లేస్తాయి. తొలి సన్నివేశంలోనే దర్శకుడు అందుకు సంబంధించిన పునాదిని గట్టిగానే వేసి, చిత్రాన్ని నడిపించేశాడు. చివర్లో నందిని నర్సింగ్‌హోమ్‌లో ఏం జరుగుతుంది? అసలు అక్కడ దయ్యం ఉందా? నందినిని చందు ఇష్టపడ్డాడా? లేక చందు మొదట ప్రేమించిన అమూల్య విషయం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దర్శకుడు కథను ముగించాడు.
తొలి సన్నివేశమే ఆకట్టుకునేలా చిత్రీకరించడంతో ఏదో వుంది సినిమాలో అని ప్రేక్షకుడు చూడటానికి అలవాటుపడిపోతాడు. నవీన్ విజయ్‌కృష్ణ నటనలో ఫరవాలేదు అనిపించినా, వేరియేషన్స్ పలికించడంలో అతని అనుభవం సరిపోలేదు. హీరో హీరోయన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాకపోవడంతో సినిమాకు అట్రాక్షన్ కరవైంది. ఆస్పత్రిలో బ్రోతల్ హౌస్ నిర్వహణ అన్న కామెడీ పాయంట్ ఎక్కడినుంచో తెచ్చుకున్నా -వెగటు అనిపించింది. అలాగే ఎంబిబిఎస్ లేని వ్యక్తులు నకిలీ డాక్టర్లుగా చెలామణీ అయిన ఉదంతాలు అప్పుడప్పుడు పేపర్లలోనే చదువుతూనే వున్నాం. అదే విషయాన్ని మరోసారి సినిమాలో చర్చించారు. రాశి ఫలాలను చూసి వైద్యం చేసే డాక్టర్‌గా జయప్రకాష్‌రెడ్డి తన సహజ మ్యానరిజంతో నవ్వించాడు. డాక్టర్ జయరామ్ చనిపోవడం, మూర్తిపై హత్యాప్రయత్నం జరగడం లాంటి అంశాలు ప్రేక్షకుడికి కొరుకుడు పడని విధంగా చిత్రీకరించినా క్లైమాక్స్‌లో ఇచ్చిన ముగింపు అర్ధవంతంగానే ఉంది. హీరోగా నటించిన విజయ్‌కృష్ణ ఉన్నంతలో పాత్రను రక్తికట్టించాడు. ‘నినే్న నినే్న చూస్తున్నా’ లాంటి ఒకటి రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ‘జీవితంలో ఓడిపోవడాలు, పాత వస్తువులు పోగొట్టుకోవడం లాంటిది జరుగుతూనే వుండాలి. లేకపోతే కొత్త వస్తువులు పరిచయం కావు. విజయం తియ్యదనాన్ని ఆస్వాదించలేం’ లాంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. చివరగా కార్పొరేట్ ఆస్పత్రులలో జరుగుతున్న అమానవీయ సంఘటనలకు ఎక్స్‌రేగా ఈ చిత్రం అనిపిస్తుంది.
ఓ రకంగా ఈ చిత్రం చూశాక కార్పొరేట్ ఆస్పత్రుల వైపు కనె్నత్తి చూడడానికి భయపడొచ్చు. సినిమాలో చర్చించిన కథ అలా సాగి, చివరలో కథనం ప్రేక్షకుడికి నచ్చేలా ముగియడంతో ఓకే అనిపిస్తుంది ‘నందిని’.

- సరయు