రివ్యూ

మళ్లీ మళ్లీ.. ఓ నీతి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** మనలో ఒకడు
**
తారాగణం:
ఆర్పీ పట్నాయక్, అనిత, సాయికుమార్, శ్రీముఖి, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు
సంగీతం: ఆర్పీ
నిర్మాత: గురజాల జగన్‌మోహన్
దర్శకత్వం:
ఆర్పీ పట్నాయక్
**
వ్యవస్థపై సామాన్యుడి పోరాటం ‘కథ’లు కొత్తేం కాదు. బోలెడంత మెలోడ్రామా నడిపించటానికీ.. సమాజంపై సణుగుళ్లు, ఏడ్పులూ మొత్తుకోళ్లూ.. విసుర్లు -ఇలా ఎన్నైనా సంధించేందుకు టార్గెట్‌గా ఉంటారుూ కథలు. కాకపోతే- ఏదో సందేశాన్ని ఇచ్చేట్టు కథని నడిపిస్తే మాత్రం ‘కథ అడ్డం తిరిగి’ ప్రేక్షకుల్ని గందరగోళంలో పడేస్తుంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి- కథ ఆలోచింపజేసేదిగా ఉంటే ఫర్వాలేదు.. అదే కూర్చోబెట్టి ‘నీతి’ పద్యాలు చెప్పారా? ప్రశ్నార్థకపు చూపుల్తో పాటు ఎందుకొచ్చిన ‘సం’దేశం అని ఆ వైపు చూట్టం మానేస్తాడు ప్రేక్షకుడు. సంగీత సామ్రాజ్యం నుంచీ.. దర్శకత్వ నటనా ట్రాక్‌వైపు మళ్లిన ఆర్పీ మాంచి టేస్ట్ ఉన్నవాడే కాదు - ‘శ్రీను వాసంతి..’ లాంటి డెప్త్ సినిమాతోపాటు.. ‘బ్రోకర్’ కథతో సమాజాన్ని ఎండగట్టి -తానేమిటో కథ పట్ల తన ‘పట్టు’ ఏమిటో తెలియజెప్పాడు. తాజాగా ‘మనలో ఒకడు’ చిత్రం కూడా మరో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సినిమా.
***
కృష్ణమూర్తి (ఆర్పీ పట్నాయక్) ఓ నిజాయితీగల ప్రొఫెసర్. అతని భార్య హంసానందిని (అనిత)తో చాలా సాదాసీదా జీవితాన్ని గడిపేస్తూంటాడు. ఏ చీకూ చింతాలేని కుటుంబం. కానీ -ఆ సామాన్యుడి జీవితంలోకి ఓ కష్టం వచ్చిపడింది -మీడియా రూపేణా. ఒకరోజు టీవీలో కృష్ణమూర్తికి సంబంధించినదిగా.. ఓ వార్త ప్రసారమవుతుంది. ఎన్నో అవినీతి కార్యకలాపాలకూ.. అసాంఘిక శక్తులతో అతడికి సంబంధం ఉన్నట్టు చిత్రీకరించబడిన ఈ వార్తా కథనం- అతడి జీవితంలో అలజడిని సృష్టిస్తుంది. నిజానికి- ఆ కథనం ప్రకారం కృష్ణమూర్తి లైఫ్ అది కాదు. తప్పుడు వార్త ద్వారా అతడు సమాజంలో అవహేళనకు గురవుతాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటాడు. తన నిర్దోషిత్వాన్ని ఎలా బట్టబయలు చేసుకోవాలో తెలీదు. అతడి ఒంటరి పోరాటం ఏ విధంగా సాగిందన్నది క్లైమాక్స్.
కావటానికి - ఇదొక సింపుల్ కథ. ఎక్కడా ఏ మలుపులూ లేకుండా.. రొటీన్‌గా వెళ్లిపోతూంటుంది. ఆర్పీ తన నటనాపటిమతో ఆద్యంతం ఆకట్టుకొంటాడు. కానీ- దర్శకుడిగా ఫస్ట్‌హాఫ్‌ని హాండిల్ చేసినంతగా.. సెకండ్ హాఫ్‌ని చేయలేదేమోనన్న అనుమానం వెంటాడుతూంటుంది. ఆ అనుమానం ఆయా సన్నివేశాల్తో బయటపడుతూంటుంది. రాన్రాను కథ గాడితప్పి... సమాజాన్ని ఏదో ఉద్ధరించేద్దాం అన్న నీతి సూత్రం వైపు పరుగులు పెడుతుంది. దాంతో- ఫస్ట్‌హాఫ్‌లో చూసిన వేగం.. సెకండ్ హాఫ్‌కి వచ్చేప్పటికి సాగతీతలా అనిపిస్తుంది. అంతమాత్రంచేత- ఆర్పీ బోర్ కొట్టించాడని కాదు. ఒక మంచి ప్రయత్నం అని గ్యారంటీగా కితాబు ఇవ్వొచ్చు. మీడియా వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏవిధంగా ఇరకాటంలో పడుతున్నారో స్పష్టాతిస్పష్టంగా చెప్పాడు. ఐతే- నిడివి విషయంలో ఎందుకు కాంప్రమైజ్ కాలేక పోతున్నారో అర్థంకాని విషయం. సినిమా అంటే ఇన్ని గంటలు కచ్చితంగా ఉండాలన్న రూలేం లేదు. అటువంటప్పుడు - ఆ టార్గెట్‌ని రీచ్ కావటానికి.. ఏ ఐటెం సాంగ్‌నో.. మరిన్ని పాటల్నో కూరిస్తే - సాగతీత అనిపిస్తుంది. ఇక్కడా అదే జరిగింది. కొన్ని సన్నివేశాలు కథకి ఏ మేరకు ఉపయోగపడ్డాయో తెలీదుగానీ.. దానివల్ల నిడివి మాత్రం పెరిగింది. ఆర్పీ పట్నాయక్ చక్కటి నటనను ప్రదర్శించి అన్నీ తానై కథని నడిపించాడు. చాన్నాళ్లకు అనిత స్క్రీన్‌పై కనిపించింది. ఉన్నంతలో ఆర్పీతోపాటు తన హావభావ వ్యక్తీకరణతో మార్కులు కొట్టేసింది. మీడియా యజమానిగా సాయికుమార్, శ్రీముఖి ఆకట్టుకొన్నారు. కథాపరంగా సందేశాత్మకంతో కూడింది కాబట్టి- సహజంగానే అక్కడక్కడ బోర్ కొట్టే అంశాలుంటాయి. ఈ సినిమా కూడా దాన్ని అధిగమించలేక పోయింది. సంగీతం ఫర్వాలేదు. మిగతా శాఖలన్నీ తమ పరిధిలో తాము చేసుకుంటూ వెళ్లాయి.

-బిఎనే్క