రివ్యూ

చతికిలపడిన ప్రేమకథ ( హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ * బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: అర్జున్ కపూర్, శ్రద్ధాకపూర్, రేహా చక్రవర్తి తదితరులు
సంగీతం: మిధున్ - తనిష్క్ బాగ్చి
రచన, స్క్రీన్‌ప్లే: తుషార్ హీరానందిని
కథ: చేతన్ భగత్
నిర్మాతలు: శోభాకపూర్, ఏక్తాకపూర్, మోహిత్ సూరి, చేతన్ భగత్
దర్శకత్వం: మోహిత్ సూరి

హాఫ్ బేక్డ్ ఫుడ్. ఉడికీ ఉడకని వంటకం. హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ ఏంటీ మరీ విడ్డూరం కాకపోతే? అని ఎవరికైనా సందేహం వస్తే.. హాఫ్ ఆలోచనల్తో దాన్ని పక్కనపెట్టేసి... హాఫ్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరిపెట్టుకొంటాం అని సర్ది చెప్పేసుకోవటం ఒక్కటే చేయతగ్గ ఉత్తమోత్తమమైన మార్గం. ‘ఆషికీ-2’ ‘ఏక్ విలన్’ చేతన్ భగత్ స్క్రీన్‌ప్లేని చూసి ముచ్చటపడి.. ఆ తర్వాత ‘3 ఇడియట్స్’తోనూ.. ‘2 స్టేట్స్’తోనూ మనసు పారేసుకొని.. ఏ ఆలోచనలు లేకుండా స్ట్రెయిట్‌గా థియేటర్‌లోకి అడుగుపెడితే మాత్రం.. ‘హాఫ్’ శాటిస్‌ఫాక్షన్ దక్కుతుంది. ఎందుకంటే- ఎవరికీ అంతుచిక్కని కానె్సప్ట్ కాబట్టి. 2014లో చేతన్ రచించిన ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ సహజంగానే పాఠకుల్లో ఉత్కంఠని కలిగించింది. కానీ- అది సెల్యులాయిడ్‌పై చేరేప్పటికి ‘ఆత్మ’ కొరవడిందేమోనన్న ఆలోచన అనుక్షణం వెంటాడుతూంటుంది.
మాధవ్ ఝా (అర్జున్ కపూర్) బీహార్ వాసి. పుట్టి పెరిగింది మారుమూల ప్రాంతం కాబట్టి.. ఇంగ్లీష్ పరిజ్ఞానం అంతంత మాత్రమే. మాట్లాడాలంటే బెరుకు. అదృష్టవశాత్తూ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లో స్పోర్ట్స్ కోటాలో అతగాడికి అడ్మిషన్ దొరుకుతుంది. అదే కాలేజీలో చదువుతోన్న రియా సోమానీ (శ్రద్ధాకపూర్)ని ఫస్ట్ ఎట్ సైట్‌లోనే ప్రేమించేస్తాడు. రియా అతణ్ణి ఒక ఫ్రెండ్‌లానే భావిస్తుంది. కేవలం ఫ్రెండ్‌ని మాత్రమే. గర్ల్‌ఫ్రెండ్‌ని కాదంటుంది. ఈ తిరకాసు అంతా ఎందుకు? ఆమెతో ఫిజికల్ రిలేషన్ షిప్ పెట్టుకొమ్మని సలహా ఇస్తాడు మాధవ్ ఫ్రెండ్ శైలేష్. రియాకి దగ్గర కావాలని మాధవ్ చేయని ప్రయత్నం లేదు. అతడు ‘్ఫజికల్ రిలేషన్’కి ప్రాముఖ్యత నిస్తున్నాడని తెలుసుకొన్న రియా తమ ఫ్రెండ్‌షిప్‌ని వదులుకొంటుంది. తన చిన్ననాటి స్నేహితుడు రోహన్‌ని పెళ్లి చేసుకొని లండన్‌లో స్థిరపడుతుంది రియా. రోహన్ ఓ వ్యాపారవేత్త. ఇలా రియా జీవితం గడిచిపోతూంటుంది. మరోవైపు మాధవ్ పేదింటి అమ్మాయిలకు తన తల్లి స్కూల్లో ఫ్రీ అడ్మిషన్ ఇప్పిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతుంటాడు. స్థానిక ఎమ్మెల్యే ద్వారా ‘్ఫండ్స్’ తెప్పించి ‘టాయిలెట్’ సౌకర్యం కల్పిద్దామని అనుకొన్నప్పటికీ.. ఎమ్మెల్యే సహకరించడు. బీహార్‌లోని స్కూల్స్‌ని విజిట్ చేయటానికి బిల్‌గేట్స్ వస్తున్నాడన్న వార్త తెలిసి.. అతణ్ణి కాంటాక్ట్ చేయటానికి ప్రయత్నిస్తాడు. ఐతే - ఇంగ్లీష్ రాకపోవటంవల్ల బిల్‌గేట్స్‌ని ఎలా కన్విన్స్ చేయాలో తెలీక తికమక పడతాడు. ఈ సందర్భంలో రియా బీహార్‌కి వస్తుంది. రోహన్ నుంచీ డైవోర్స్ తీసుకున్నట్టు చెబుతుంది. బిల్‌గేట్స్ వచ్చేప్పటికి ఇంగ్లీష్‌లో ఒక స్పీచ్‌ని మాధవ్ కోసం ప్రిపేర్ చేస్తుంది రియా. ప్రసంగం విన్న బిల్‌గేట్స్ ‘్ఫండ్స్’ ఇవ్వటానికి ఒప్పుకుంటాడు. ఇంకోవైపు రియా బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతోందనీ, న్యూయార్క్ సిటీకి వెళ్లటానికి సన్నాహాలు చేస్తోందని తెలుసుకొంటాడు మాధవ్. ఇండియాతో సంబంధాలన్నీ తెంచేసుకొని న్యూయార్క్ వెళ్లిపోతుంది రియా. మాధవ్ కాలేజ్ ఫ్రెండ్ శైలేష్ ఆమెని మర్చిపొమ్మని సలహా ఇస్తాడు.
ఓ ఆరు నెలల తర్వాత ఓ ఈవెంట్‌లో రియాని కలుస్తాడు మాధవ్. క్లైమాక్స్‌లో ఏమైందన్నది తెలిసిందే.
‘దోస్త్ సే జ్యాదా.. గర్ల్‌ఫ్రెండ్ సే కమ్’ డైలాగ్ విన్న తర్వాత.. కథ ‘హాఫ్’ అర్థమై పోతుంది. టైటిల్‌కి సరైన న్యాయం జరిగిందా? అంటే.. అదీ మాట వరసకే. కొన్ని కథలు చదువుతూంటే.. ఆలోచనాలోచనల్లోకి వెళ్లిపోతూంటాం. కథలో మమేకమై.. పాత్రల్తో పాటు నడుస్తూంటాం. ఐతే -అదీ స్క్రీన్‌పైకి వచ్చేప్పటికి.. ఆ పాత్రల్తో నడవటానికి ఎక్కడో ఏదో అడ్డు పడుతూన్నట్టు ఉంది. అన్నీ అరకొర అన్నట్టుగా తయారైంది. ‘హాఫ్’ గర్ల్‌ఫ్రెండ్. ‘హాఫ్’ దోస్త్. ఫిజికల్ రిలేషన్‌షిప్ మెయింటెయిన్ చేయమని ఫ్రెండ్ సలహా ఇస్తే.. అతగాడు అందుకు ప్రయత్నించటం. వీరిద్దరి మధ్య ‘ప్రేమ’ భావన ఎక్కడ? ఆ ఫీలింగ్‌ని తెప్పించటంలో దర్శకుడు పూర్తిగా ఫెయిలయ్యాడు. ఈ కథకి ఒక సామాజికాంశాన్ని జోడించటంతో.. కథ చతికిలపడటం మరో మైనస్ పాయింట్. ఏతావతా తేలిందేమిటంటే- ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొంటే.. పూర్తి స్థాయిలో సామాజిక సేవ చేయ్యొచ్చునన్నది.
ఇదొక ప్రేమ కథ కాదు. ‘హాఫ్’ ఫ్రెండ్‌షిప్ కాదు. యువతకి నచ్చే అంశాలూ ఏమీ లేవు. చిత్రీకరణ పరంగా ‘రిచ్’ లుక్ వచ్చినప్పటికీ.. ఏ ఫీలింగ్ లేకుండా థియేటర్‌లోంచి బయటికి వస్తాం. అంతే! ‘హాఫ్ బేక్డ్ గర్ల్‌ఫ్రెండ్’

-బిNK