కృష్ణ

ఫ్లైఓవర్ కోసం రోడ్డు విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని నిర్ణీత సమయానికి పూర్తి చేసే లక్ష్యంతో రాత్రి, పగలు తేడాలేకుండా శరవేగంతో పనులు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా దుర్గగుడి ఘాట్‌రోడ్ ప్రవేశం వద్ద రహదారిని ఆరులేన్లకు విస్తరింపచేసేందుకై సమీపంలో కృష్ణానదిలో కొంతమేర పూడ్చివేత పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. సాధ్యమైనంతగా రోడ్డుకు ఓ వైపుననున్న గృహాలను నేలమట్టం చేయకుండా అవసరమైన ప్రదేశాల్లో కృష్ణానదిని పూడ్చివేసేందుకు నిపుణులు నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా నదిలో ఐరన్ దిమ్మెలతో అడ్డుగోడలు ఏర్పాటు చేసి ముందుగా నీటిని పక్కకు మళ్లిస్తున్నారు. ఆపై ఆ ప్రాంతాన్ని కంకర సిమెంట్‌తో పూడ్చివేత పనులు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు సమాంతరంగా పూడ్చుతున్నారు. పనిలో పనిగా దుర్గఘాట్ నుంచి ఫెర్రి వరకు 14.కి.మీ మేర ఒక పుష్కర ఘాట్ నిర్మాణం కోసం కూడా నదిని కొంత మేర పూడ్చాల్సి వస్తున్నది. ఫ్లైఓవర్ నిర్మాణపు పనులతో ప్రమేయం లేకుండానే పుష్కరఘాట్ నిర్మాణ పనులు జరిగేలా కలెక్టర్ బాబు అధికారులను పురమాయిస్తున్నారు. మోడల్ గెస్ట్‌హోస్ ప్రాంతంలో పిల్లర్ల నిర్మాణంకై 7 మీటర్ల లోతులో డ్రిగ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంకు భూసేకరణతో సహా మొత్తం రూ. 427 కోట్లు అంచనా వ్యయం కాగా 2.320 కి.మీ పొడవైన ఈ వంతెన నిర్మాణం జరుగనున్నది. 1850 మీటర్ల ఆరులైన్ల పై నిర్మాణమవుతున్న ఈ వంతెనకు హైదరాబాద్ వైపు 220 మీటర్లు, విజయవాడ నగరం వైపు 250 మీటర్ల అప్రోచ్‌రోడ్డు పనులు ముందుగా జరుగుతున్నాయి.
ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య
వాహనాల దారి మళ్లింపు వల్ల పాతబస్తీలో అడుగడుగునా ట్రాఫిక్ స్తంభిస్తుండటంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. హైదరాబాద్ నుంచి నగర శివారుకు నాలుగు గంటల్లో వచ్చేస్తున్న వాహనాలు నగరంలోకి ప్రవేశించడానికి కనీసం గంట సమయం పడుతున్నది. హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు బిఆర్‌పి రోడ్డులో కాస్తంత సునాయాసంగా వెళుతున్నప్పటికీ పంజా సెంటర్‌లోనూ సొరంగం ప్రాంతంలోనూ, కుమ్మరిపాలెం సెంటర్‌లోనూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఇక తిరుగు ప్రయాణంలో పార ఫ్యాక్టరీ ఉంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకు తారాపేట స్టేషన్ వైపు సింగిల్‌రోడ్డు కావటంతో ఏ ఓక్క వాహనం నిలిచినా వాహనాలన్నీ నిలిచిపోతున్నాయి. మధ్యమధ్యలో అడ్డదారుల నుంచి ఆటోలు చిన్న వాహనాలు దూసుకువస్తుండటంతో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతున్నది. దారి పొడవునా ట్రాఫిక్ పోలీసులను నియమించకపోవడం వల్లనే ఈ సమస్యలన్నీ చోటు చేసుకుంటున్నాయి. అందుకే పోలీసు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు తరచూ ఈ రోడ్లపై తనిఖీలు చేస్తుంటేగాని ప్రజలు పడే బాధలేమిటో స్పష్టంగా తెలుస్తాయి.