రాష్ట్రీయం

మరో రోదసీ కేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవంతంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రయోగం భారత్ మరో అరుదైన ఘనత
ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థ దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా ప్రయోగించింది. స్వదేశీ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఇది ఆరో ప్రయోగం.
----------------------------------
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహ ప్రయోగం సక్సెస్
కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పిఎస్‌ఎల్‌వి-సి 32
జిపిఎస్ తరహా వ్యవస్థ దిశగా మరో అడుగు
రోదసీ రంగంలో ఇస్రో మరో ముందడగు

నెల్లూరు/ సూళ్లూరుపేట, మార్చి 10: అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశీయ ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్న కలను సాకారం చేసుకొనే దిశగా మరో అడుగు పడింది. రోదసీ ఆధారిత సొంత దిక్సూచి వ్యవస్థను కలిగివున్న అతికొద్ది దేశాల సరసన సగర్వంగా చేరింది. స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌లోని ఆరో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్‌ను ఇస్రో శాస్తవ్రేత్తలు దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఘనత సాధించింది.
ఇందుకు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికైంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్‌ను షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి గురువారం సాయంత్రం 4గంటలకు ఇస్రో ప్రయోగించింది. పిఎస్‌ఎల్‌ఎల్‌వి-సి 32 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరగానే శాస్తవ్రేత్తలు కరతాళ ధ్వనులతో ఆనందం వ్యక్తం చేశారు. కక్ష్యలోకి చేరిన వెంటనే ఉపగ్రహంలోని రెండు సౌర ఫలకాలు తెరచుకున్నాయి.
వారం రోజుల్లో ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మండించడం ద్వారా దాన్ని నిర్ణీత తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 1425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం 12సంవత్సరాలు సేవలు అందించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్ సిరీస్‌లో ఇది ఆరోది. ఇందులో మొత్తం 7 ఉపగ్రహాలు ఉంటాయి. ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక మూడు ఉపగ్రహాలు భూస్థిర కక్ష్యలో ఉంటాయి.
నాలుగు ఉపగ్రహాలు భూ అనువర్తిత కక్ష్యలో ఉంటాయి. భారతదేశం చుట్టూ 1500 కిలోమీటర్ల దూరం వరకు ఈ ఉపగ్రహ వ్యవస్థ సేవలందిస్తుంది. ఈ వ్యవస్థ భూ, జల, వాయు మార్గాలకు స్థితి, స్థాన, దిక్కులను తెలియజేస్తుంది. డ్రైవర్లకు దృశ్య, స్వర దిశా నిర్దేశం చేస్తుంది. వాహన గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలోను, నౌకల సమూహ నిర్వహణలోను సాయపడతుంది. మొబైల్ ఫోన్‌తో అనుసంధానం అవుతుంది.
వచ్చే నెలలో మరో ప్రయోగం
దేశీయ ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థ శ్రేణిలో మరో రాకెట్‌ను ఏప్రిల్ నాటికి ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ చెప్పారు. పిఎస్‌ఎల్‌వి సి -32 ప్రయోగం విజయానంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని ప్రయోగించామని ఇందులో మరో చివరి ఉపగ్రహాన్ని వచ్చే నెలలో ప్రయోగించనున్నట్లు తెలిపారు.