తెలంగాణ

రోడ్లకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: రాజధాని నగరంలోని రోడ్లను 17,843 కోట్ల వ్యయంతో నాలుగు దశల్లో అభివృద్ధి చేయనున్నట్టు రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డిపి ) ఫేస్ వన్ కింద 2631 కోటతో ఫ్లైఓవర్ల నిర్మాణం, కూడళ్లను అభివృద్ధి పరుస్తామన్నారు. ఫేస్ 2లో 6487 కోట్లతో పలు పథకాలు చేపట్టనున్నట్టు చెప్పారు. మూడవ ఫేస్‌లో 3625 కోట్లతో పనులు చేపడతామని, నాలుగవ ఫేస్‌లో 5100 కోట్లతో పనులు పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో జాతీయ రహదారులపై ఆరాంగఢ్, ఉప్పల్, ఎల్‌బి నగర్ కూడళ్ల వద్ద మూడు ఎలివేటెడ్ కారిడార్లు 1400 కోట్లతో నిర్మించేందుకు కేంద్రం అనుమతిచ్చిందని తుమ్మల వివరించారు. రోడ్ల నిర్మాణంపై మంత్రి ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష జరిపారు. రాష్ట్ర పరిధిలో నగరం నుండి వెలుపలికి వేళ్లే రేడియల్ రోడ్ల అభివృద్ధికి 560 కోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు. రహదారుల విస్తరణకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారిందని, కోర్టుల్లో కేసులు సత్వరం పరిష్కారం కాకపోవడం వల్ల పనులు చేపట్టలేక పోతున్నట్టు చెప్పారు. వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. భూగర్భ మురుగు, మంచినీటి పైపుల వ్యవస్థ పటిష్టపర్చిన తర్వాత వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. అధిక వ్యయం, అధిక మన్నికతో కూడుకున్న నిర్మాణాలను తరుచుగా తవ్వడంవల్ల మొత్తం ఆ ప్రాంతాల్లో రహదారులు దెబ్బతింటాయని తుమ్మల హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేకపోవడం హైదరాబాద్‌లో రోడ్లకు ప్రధాన సమస్యగా మారిందన్నారు. అన్ని శాఖల మధ్య సమన్వయానికి అధికారులతో తరుచుగా సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజధాని రోడ్లపై గుంతలు పడినచోట సత్వర మరమ్మతు కోసం 25 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు తుమ్మల తెలిపారు. అలాగే వర్షాకాలంలో గుంతలు పడితే అప్పటికప్పుడు పూడ్చేందుకూ ప్రత్యేక బృందాలు ఉంటాయన్నారు.