జాతీయ వార్తలు

రోహిత్ తమ్ముడికి ఉద్యోగం ఇచ్చిన కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి వేముల రోహిత్ కుటుంబాన్ని ఆదుకుంటానన్న దిల్లీ సిఎం కేజ్రీవాల్ తన మాట నిలుపుకున్నారు. రోహిత్ తమ్ముడు రాజాకు దిల్లీ ప్రభుత్వంలో గుమస్తా ఉద్యోగాన్ని ఇస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ ఉద్యోగంలో చేరాలా? వద్దా? అనే విషయమై ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని రాజా చెబుతున్నారు. ఎమ్మెసీ చదివి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)లో ఉత్తీర్ణత సాధించిన రాజా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హుడే. ఆయనకు గుమస్తా ఉద్యోగం ఇవ్వడం పట్ల రోహిత్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. కారుణ్య నియామకం కింద పెద్ద ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదని దిల్లీ ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి తెలిపారు.