జాతీయ వార్తలు

రోజా పిటిషన్‌ను 14న విచారించనున్న సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనపైన ఏడాది సస్పెన్షన్ విధించడాన్ని సవాల్ చేస్తూ వైకాపా ఎమ్మెల్యే ఆర్ కె రోజా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 14న విచారణకు రానుంది. శుక్రవారం ఈ పిటిషన్ జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్, సి నాగప్పన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. రోజా తరఫున్యాయవాది ఇందిరా జై సింగ్ వాదనలు వినిపించడానికి సిద్ధం కాగా,ఈ పిటిషన్‌ను జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ విచారించేందుకు విముఖత చూపుతూ మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని కోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. కాగా పార్టీ ఫిరాయింపులు, రాజ్యాగపరమైన కేసులను పరిష్కరించే ప్రత్యేక ధర్మాసనం ముందుకు రోజా పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది . అసెంబ్లీ రూల్ 340 ప్రకారం తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన తీర్మానం సహేతుకతను ఆమె ప్రశ్నిస్తూ, సస్పెన్షన్‌కూ ఆధారమైన వాయిదా తీర్మానాన్ని కొట్టేసి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించేకు తనకు అవకాశం కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.