హైదరాబాద్

హైందవ సంప్రదాయానికి ప్రతీక షష్టి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: భారతదేశంలో పుట్టిన మానవుడు ఏ దేశంలో ఉన్న షష్టి పూర్తి జరుపుకోవడం హైందవ సంప్రదాయమని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. కొడుకు కోడళ్లు, కూతురు అల్లుళ్లు, మనవలు మనవరాళ్లు, అన్నదమ్ములు అందరూ కలిసి జరుపుకునే కుటుంబ సంప్రదాయ పండగ షష్టిపూర్తి అన్నారు. కినె్నర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్‌టిఆర్ ఆడిటోరియంలో సివి సుబ్బారావు దంపతుల షష్టిపూర్తి సన్మాన మహోత్సవం రోశయ్య పాల్గొన్నారు. సివి సుబ్బారావు అనేక పత్రికలలో పనిచేసిన మంచి రచయత అని, అమెరికా వెళ్లిన తెలుగు సంప్రదాయలను మర్చిపోని పాత్రికేయుడిని గవర్నర్ రోశయ్య కొనియాడారు. కార్యక్రమానికి సినీ నటుడు మురళీమోహన్ అధ్యక్షత వహించారు. సీనియర్ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి, కూచిభోట్ల ఆనంద్ పాల్గొని కినె్నర వ్యవస్థాపకుడు ముద్దాళి రఘురాం స్వాగతం పలికారు. రామాచారి బృందం సంగీత విభావరి సమర్పించారు.