ప్రకాశం

వేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-- 2015 రౌండప్ --

ఒంగోలు,డిసెంబర్ 25: జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయనే చెప్పవచ్చు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టుల నిర్మాణాలు ఈ సంవత్సరంలో వాటి నిర్మాణాల పురోగతి ఊపందుకుందనే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు రాష్టవ్య్రాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణాలపై దృష్టిపెట్టిన నేపధ్యంలో ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ రిజర్వాయరు నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయనే చెప్పవచ్చు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణాల వేగం తగ్గటంతో ముఖ్యమంత్రి ప్రాజెక్టుల బాట పట్టారు. దీంతో జిల్లా ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ సంవత్సరంలోనే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిని స్వయంగా చూసేందుకు జిల్లాకు రావటం జరిగింది. అదేవిధంగా గుండ్లకమ్మ రిజర్వాయరు వద్ద ప్రాజెక్టుఅధికారులు, జిల్లాఅధికారులతో సమీక్షాసమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించి ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో అనుకున్న సమయానికి పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేయటం జరిగింది. రాష్టభ్రారీ నీటిపారుదలశాఖమంత్రి దేవినేని ఉమమాహేశ్వరరావు సైతం ప్రాజెక్టుల బాట పట్టారు. మొత్తంమీద జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించటంతో ముఖ్యంగా వెలుగొండప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయనే చెప్పవచ్చు.
ముఖ్యంగా పూలసుబ్బయ్య వెలుగొండప్రాజెక్టు నిర్మాణం జరిగే ఒక్క ప్రకాశం జిల్లాలోని రైతులే కాకుండా కడప, నెల్లూరు జిల్లాలోని రైతాంగానికి ఎంతో ఉపయోగపడనుంది. ప్రాజెక్టు పరిధిలోని భీడుభూములన్ని సస్యశ్యామలం కానున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిఅయితే ఈ మూడు జిల్లాల్లోని 30మండలాల్లోని నాలుగులక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.అదేవిధంగా 15. 25లక్షలమంది ప్రజలకు దాహర్తితీరనుంది. ఈ ప్రాజెక్టును ఐదువేల 150కోట్లరూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టనె్నల్‌పనులు జరుగుతున్నాయి. గతంలో టనె్నల్ నిర్మాణంలో అంతరాయం ఏర్పడటంతో కొంతమేర ఆలస్యమైంది.
ఇదిఇలాఉండగా గుండ్లకమ్మ రిజర్వాయరు నిర్మాణపనుల్లో చిన్నచిన్న పనులు ప్రాజెక్టు అధికారులు పూర్తిచేస్తున్నారు. ఈ రిజర్వాయరు నిర్మాణం ద్వారా ఖరీప్‌లో 62వేల 368ఎకరాలు, రబీసీజన్‌లో 80వేల 060 ఎకరాలకు సాగునీరు అందనుంది. అదేవిధంగా రెండులక్షల 56వేలమంది ప్రజలకు తాగునీటి వసతి కలగనుంది. ఈసంవత్సరంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రిజర్వాయరును జాతికి అంకితం చేయాల్సిఉంది. కాని అతివృష్టిపరిస్ధితుల కారణంగా రిజర్వాయరులో నీటిమట్టం అనుకున్నంత స్థాయిలో లేకపోవటంతో ముఖ్యమంత్రి పర్యటన వాయిదాపడుతూ వస్తుంది. రిజర్వాయరులో నీటిగళగళలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. జిల్లాలో పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయరు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈపాటికే మాగుంట సుబ్బరామరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు పనులు పూర్తికావటంతో ఆ ఫలాలు ఆయా ప్రాంతాల ప్రజలకు అందుతున్నాయి. మొత్తంమీద జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలు గతంలో కంటే ఈ సంవత్సరంలో వేగంగా జరుగుతున్నాయనే చెప్పవచ్చు.