జాతీయ వార్తలు

చట్టసభల్లో స్ర్తిలకు మూడోవంతు స్థానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. శనివారం ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో మహిళా ప్రజాప్రతినిధుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లయినా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 12 శాతానికి మించలేదని, పరిస్థితి ఇలా ఉంటే మహిళా సాధికారత ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బేటీ బచావ్, బేటీ పడావ్ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రణబ్ సూచించారు. చాలాదేశాలతో పోల్చితే మన దేశంలో మహిళలు అనేక రాంగాల్లో రాణిస్తున్నారని, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెరగాలంటే అన్ని రాజకీయ పార్టీలు 33 శాతం టిక్కెట్లను మహిళలకు కేటాయించాలని ఉపరాష్టప్రతి అన్సారీ విజ్ఞప్తి చేశారు.