రంగారెడ్డి

దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 30: దేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో నిర్వహించిన టిఆర్‌ఎస్ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా గ్రేటర్ సీనియర్ నాయకుడు తోకల శ్రీశైలంరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, తెదేపా పార్టీల నుంచి వేలాది మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని మంత్రి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, టిడిపికి పునాదులు లేకుండాపోయాయని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ జెండా ఎగురవేయడం తథ్యమని జోస్యం చెప్పారు. తెలంగాణ కోసం 13 ఏళ్లు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసిఆర్‌కు దక్కుతుందని అన్నారు.
ప్రపంచంలోనే హైదరాబాద్ మహానగరాన్ని అగ్రనగరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చెందిన నగరాల సరసన నిలబెట్టడం ఖాయమన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ధనవంతుల సరసన నిలబెడుతూ పేదవారి కోరిక తీర్చిన కేసిఆర్ గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. దేశంలో డబుల్‌బెడ్‌రూం స్కీం ఎక్కడాలేదని, ఒక్క తెలంగాణలోనే కేసిఆర్ అమలు చేసి చూపారన్నారు. మొదటి విడతగా ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్లు పంపిణీ చేశామని, మార్చిలో మరో వెయ్యి ఇళ్లు రెండవ విడతగా కేటాయించనున్నట్టు వివరించారు. దశలవారీగా ఇళ్లను కట్టిస్తూ అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారాన్ని కేసిఆర్ పూర్తి చేసే కృతనిశ్చయంతో పని చేస్తున్నారని తెలిపారు. అన్ని కులాలను సమాన దృక్పథంతో గుర్తించి వారికి న్యాయం చేస్తున్నట్టు వెల్లడించారు. దేశంలోనే రైతులకు ఎక్కడా లేనివిధంగా సబ్సిడీలు, రుణమాఫీలు ఇచ్చిన ఘనత కేసిఆర్‌కే దక్కిందని, అన్ని విధాలుగా రైతులకు అండగా నిలిచి వారికి తోడ్పాటునందిస్తున్నారని వివరించారు. ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి తప్ప రైతులకు నిజమైన సేవ చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ద్వారా రూ.200 కోట్లు కేటాయించామని, ప్రతి నియోజకవర్గానికి రూ.15 నుంచి రూ.20 కోట్లు మంజూరు చేసి పనులు నిర్వహిస్తున్నామన్నారు. రూ.1900 కోట్ల నిధులతో 30లక్షల మందికి మంచినీరు తాగించే లక్ష్యంతో కేసిఆర్ పని చేస్తున్నారని వెల్లడించారు. మరో రూ.20 వేల కోట్లు నగరంలోని వంతెనలు, రోడ్లు తదితర పనుల కోసం కేటాయించామని ఆయన గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిఆర్‌ఎస్ దెబ్బకు ప్రతిపక్షాలు ఊడ్చుకుపోతాయని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంత్‌రావుమాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి కేసిఆర్‌కు సహకరించి అభివృద్ధి చేసుకుందామని సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్నదమ్ములుగా విడిపోయినందుకే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు పోటీలు పడుతూ అభివృద్ధిలో దూసుకువెళ్తున్నాయని తెలిపారు. ధనవంతుడైన అంబానీలాంటి అన్నదమ్ములు విడిపోయి ప్రపంచంలోనే పోటీ పడుతూ వ్యాపారంలో దూసుకెళ్తున్నారని, అదే విధంగా రెండు రాష్ట్రాలు ఇండియాలోనే అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నాయన్నారు. పార్టీలో పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని, నిరాశపడకుండా పార్టీ పురోగాభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగకుండా పార్టీ ఆలోచిస్తుందని వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టడానికి అధిష్టానం నిర్ణయించిందని వెల్లడించారు.రాబోయే ఎన్నికల్లో ఇతర పార్టీలు గల్లంతు అయ్యే విధంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రేటర్‌లో అన్ని డివిజన్లు కైవసం చేసుకొని మేయర్ పీఠంపై టిఆర్‌ఎస్ జెండా ఎగురవేసి మరోసారి సత్తాచాటుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ సీనియర్ నాయకులు తోకల శ్రీనివాస్‌రెడ్డి, స్వర్ణలతా భీమార్జున్‌రెడ్డి, తలారి అశోక్, అక్కెం కృష్ణయాదవ్, తోకల శ్రీనివాస్‌రెడ్డి, ముకీద్‌చందా, దేవులపల్లి స్వామి, సరికొండ వెంకటేష్, బాలపోచయ్య, పడమటి శ్రీ్ధర్‌రెడ్డి, శీలం తిరుపతిరెడ్డి, చెన్‌రెడ్డి బుచ్చిరెడ్డి, సీతారాం మహిపాల్, లిక్కి వెంకటేశ్వర్‌రెడ్డి, కపిల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.