రంగారెడ్డి

బిజెపి, టిడిపితో భాగ్యనగర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 26: హైదరాబాద్ అభివృద్ధికోసం బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రామంతాపూర్ నెహ్రూనగర్ చౌరస్తాలో జరిగిన బిజెపి బహిరంగ సభలో ప్రసంగించారు. గత కాంగ్రెస్ హయాంలో అభివృద్ధిలో వెనుకబడిన దేశాన్ని మాజీ ప్రధాని వాజ్‌పేయి ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఇదేబాటలో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. ఉప్పల్ నియోజకవర్గం ప్రజల తాగునీటి అవసరాలకోసం కేంద్ర ప్రభుత్వం రూ.400కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. సమస్యలను పట్టని కాంగ్రెస్, కల్లబొల్లి మాటలతో వచ్చే టిఆర్‌ఎస్, మతోన్మాద మజ్లిస్‌ను గ్రేటర్ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేవలం హైదరాబాద్‌లోని అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు 27500 మంజూరయ్యాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరుగాలంటే బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా ప్రజల వెంటే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. మంత్రి కెటిఆర్ ఉప్పల్‌ను దత్తత తీసుకోవడం కాదని, తన నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించాలని హితవు పలికారు. ఇక్కడ ఏం అభివృద్ధి పనులు చేయాలో ఎమ్మెల్యేగా తనకు బాగా తెలుసని చురకలు అంటించారు. రామంతాపూర్, హబ్సిగూడ, ఉప్పల్, చిల్కానగర్ మరింత అభివృద్ధి చెందాలంటే బిజెపి అభ్యర్థులు వల్లపు దీపిక, తిండేరు సురేఖ, మహంకాళీ రూపారాణి, బి.అనితాసింగ్‌ల కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. సభలో ఎంఎల్‌సి రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్.ఇంద్రసేనారెడ్డి, బిజెపి నేతలు వల్లపు జగన్, తిండేరు హన్మంతరావు, మహంకాళీ లక్ష్మణ్, బి.పర్వేష్‌సింగ్ పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమం విస్మరించే పార్టీలకు బుద్ధి చెప్పాలి
కెపిహెచ్‌బికాలనీ, జనవరి 26: ప్రజా సంక్షేమాన్ని విస్మరించే పార్టీలకు గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బాలాజీనగర్ డివిజన్ టిడిపి కార్పోరేటర్ అభ్యర్ధి గోనె రూప శ్రీనివాస్‌రావు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వేలాది బైక్‌లతో యువకులు బాలాజీనగర్ డివిజన్ నుండి టెంపుల్ బస్టాప్ వరకు ర్యాలీగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టిఆర్‌ఎస్‌ను గ్రేటర్‌లో చిత్తుగా ఓడించాలన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే అని గొప్పలు చెప్పుకోవడం తప్ప తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే టిడిపికి పట్టం కట్టాలని సూచించారు. బాలాజీనగర్ డివిజన్ కార్పోరేటర్ అభ్యర్ధి గోనె రూప శ్రీనివాస్‌రావును భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. ప్రచార కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రావు, బాలాజీనగర్ డివిజన్ ఇన్‌చార్జి జూపూడి ప్రభాకర్, గోనె శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
ఉపనిషత్తుల సారం ‘జ్ఞాన మంజూష’
కాచిగూడ, జనవరి 26: ఉసనిషత్తుల సారం జ్ఞానమంజూష అని పలువురు వక్తలు అన్నారు. ప్రముఖ రచయిత్రి డాక్టర్ ఉమాదేవి రచించిన ‘జ్ఞానమంజూష’ గ్రంథావిష్కరణ సభ ఆచార్య శిప్రముని పీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వార్థ సంక్షేమ సమితి అధ్యక్షుడు బ్రహ్మశ్రీ పివి.మనోహరరావు, ప్రముఖ చారిత్రక నవలాచక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్, రచయిత్రి డా.యం. ఉమాదేవి, డా.నందకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు గ్రంథావిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, వేదములలో కర్మకాండ, ఉపనిషత్తులలో జ్ఞానకాండ ఉన్నదని తెలిపారు. లౌకికమైన విషయాన్ని కోరికలని అజ్ఞానాన్ని నాశనం చేసి పరమాత్మ గురించి జ్ఞానాన్ని కలిగించేది ఉపనిషత్తు అని తెలిపారు. ఉమాదేవి సాధారణ పాఠకులను దృష్టిలో పెట్టుకుని సరళశైలిలో గ్రంథాన్ని ఆవిష్కరించారని కొనియాడారు. గ్రంథం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సభకు ముందు సుధామాల శిష్యబృందం చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఎంతో అలరించాయి. డా. కళావేంకట దీక్షితులు, నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ, పద్మనుషమ, డా. అక్కిరాజు సుందర రామకృష్ణ, షీకిల్ అహ్మద్, డా.సాధన నరసింహాచార్య పాల్గొన్నారు.