రంగారెడ్డి

కూతురు సహా గర్భిణి బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 12: అనుమానాస్పద స్థితిలో కూతురితో సహా ఓ గర్భవతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే... సిద్ధిపేట్, రాఘవాపూర్‌కు చెందిన దుద్దెడ శృజన అలియాస్ కవిత (25), దుబ్బాక, బొప్పాపూర్‌కు చెందిన దుద్దెడ శంకర్ (30)కు 2014 సంవత్సరంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.3 లక్షల నగదు, 120 గజాల స్థలాన్ని కట్నంగా ఇచ్చారు. శంకర్ దంపతులు సూరారం కాలనీ, రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ మ్యారీగోల్డ్ హోటల్‌లో పనిచేస్తాడు. కవిత ఇంట్లోనే ఉంటుంది. వీరికి కూతురు శ్రీజ (3) సంతానం.
కవిత ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. శంకర్‌కు వివాహానికి ముందే మరో మహిళతో పరిచయం ఉంది. ఈ విషయంలో శంకర్, కవితకు మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కవితను శంకర్ కొట్టి పుట్టింటికి పంపించేశాడు. కొద్దిరోజుల క్రితమే శంకర్ మళ్లీ కవితను తీసుకువచ్చాడు. అయినా శంకర్ తీరుమారలేదు. కవిత మనస్థాపానికి గురై కూతురు శ్రీజతో సహా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా గదిలో రెండు పేజీల సూసైడ్‌నోట్ దొరికింది.
సూసైడ్ నోట్‌లో రాసిన రైటింగ్ కవితది కాదని మృతురాలి సోదరుడు చెబుతున్నాడు. కవితను భర్తే హత్యచేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య అయితే తల్లిదండ్రులు వచ్చేలోపే ఎందుకు గాంధీకి తరలించారని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువత ఆలోచనా విధానంతో దేశాభివృద్ధి
జీడిమెట్ల, జనవరి 12: యువత ఆలోచన విధానం పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డినగర్ డివిజన్ గాంధీనగర్ మహాత్మా గాంధీ కమీటీ హాల్‌లో స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలను స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు సీహెచ్ మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రక్తదానం, ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రారంభించారు. వివేకానందుడు సూచించిన బాటలో యువత పయనించాలని సూచించారు. ఎమ్మెల్యే కేపీ వివేక్, జిల్లా యువజన విభాగం అధికారి ఉపెందర్‌రెడ్డి, ఆర్‌డీఓ మదుసూదన్, మండల తహసీల్దార్ భూపాల్, సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్, ఉపాధ్యక్షుడు సాయిగోపాల్, స్థానిక నేతలు జల్దా రాఘవులు, అబ్దుల్ ఖాదర్, ఎల్లయ్య, రహీమ్, సుదర్శన్, యువకులు, అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రంగారెడ్డినగర్ చౌరస్తాలో...
రంగారెడ్డినగర్ చౌరస్తాలో స్వామి వివేకానందుని జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. డీపీ పల్లి సర్పంచ్ రాముగౌడ్, నాయకులు వల్లపు కృష్ణ, రవిందర్‌రెడ్డి పాల్గొన్నారు.