రంగారెడ్డి

లంబాడీల ఆశాజ్యోతి సేవాలాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జనవరి 12: గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గిరిజన లంబాడీలు, బంజార సేవా సమితి ప్రతి నిధులు ఘనంగా నిర్వహించారు. పట్నం మాట్లాడుతూ గిరిజన లంబాడీ సమాజం ఉద్ధరణకు సేవాలాల్ మహారాజ్ విశేషంగా కృషి చేశారని అన్నారు. బంజారా సంఘం ప్రతినిధులు వాసు పవార్ నాయక్, శంకర్ పవార్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
లాభాల బాట టీఎస్‌ఆర్టీసీ : పట్నం
ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పురస్కరించుకొని 4800 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా 1400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఉన్న 97 ఆర్టీసీ డిపోలలో కేవలం 29 డిపోలు లాభాల బాటలో ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం కసరత్తులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
ఆర్టీసీ డిపోల పరిధిలో ఉన్న ఆస్తులను పరిరక్షిస్తూనే ఆయా డిపోల పరిధిలో ఆదాయం సమకూర్చుకునే యత్నాలు చేపడుతున్నట్లు చెప్పారు. డిపోలు, ఆర్టీసీ బస్టాండ్‌ల ఆవరణల్లో దుకాణాల సముదాయాలు, నిర్మాంచి ఆదాయం సమకూరేలా చర్యలు చేడుతున్నట్లు మంత్రి వివరించారు.
పల్లెవెలుగుతో నష్టాలు
పల్లెవెలుగు గ్రామీణ ప్రాంతాలకు నడుపుతున్న బస్సులతో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మంత్రి పట్నం పేర్కొన్నారు. ఏసీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల నుంచి ఆర్టీసీకి ఆదాయం లభిస్తుందని తెలిపారు. తాండూరు ఆర్టీసీ డిపోను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. బస్టాండ్‌లో ప్లాట్‌ఫారాల సంఖ్య పెంపుతో పాటు, అదనపు భవన సముదాయాలను ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించినట్లు తెలిపారు.
మహనీయుడు
స్వామి వివేకానందుడు
భారతదేశ ప్రతిష్ట, సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు అని మున్సిపల్ చైర్‌పర్సన్ బీ.సునీతా సంపత్ పేర్కొన్నారు. శుక్రవారం స్వామి వివేకానందుని జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వామి వివేకానందుని నిలువెత్తు విగ్రహానికి పూలమాలలను చైర్‌పర్సన్ బీ.సునీతా సంపత్, మాజీ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ వేసి నివాళులు అర్పించారు.
వివేకానందుని విగ్రహం ఆవిష్కరణ
తాండూరు డివిజన్ పెద్దెముల్ మండలంలోని ఆడ్కిచర్లలో వివేకానంద యువజన సంఘం ప్రతినిధులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. వివేకానందుడి బోధనలు అందరూ ఆచరించి దేశ సమైక్యత, సమగ్రతను కాపాడాలని మంత్రి ఉద్ఘాటించారు.