రంగారెడ్డి

హయత్ నగర్ ఎంపీపీపై అట్రాసిటీ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జనవరి 12: వడ్డీ వ్యాపారం విషయంలోగిరి పెట్టిన ఇంటి పేపర్లు అడిగినందుకు గిరిజనులను కులం పేరుతో దూషించిన హయత్‌నగర్ మండల పరిషత్ అధ్యక్షురాలు హరిత ధన్‌రాజు గౌడ్ దంపతులపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసునమోదైనట్లు ఏసీపీ రవిందర్ రెడ్డి తెలిపారు. ఏసీపీ తెలిపిన వివరాలు ప్రకారం ఇంజాపూర్ గ్రామపంచాయితి పరిధిలోని తుల్జ్భావానినగర్ కాలనీకి చెందిన రమావత్ రాంకోటితో పాటు మరికొన్ని గిరిజన కుటుంబాలు ఎంపీపీ భర్త ధన్‌రాజు గౌడ్ వద్ద తమ అవసరం కోసం ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి కొంతమెత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నారు. హరిత ధన్‌రాజు వారికి తమ ఇంటి పేపర్లు ఇవ్వకుండా ఇంటిచుట్టు తిప్పుకుంటూ అధిక వడ్డీ కావాలని కులం పేరుతో దూషించినట్లు బాధితులు శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంపీపీ దంపతులు హరిత ధన్‌రాజు గౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ, అధిక వడ్డీకి సంబంధించిన సెక్షన్‌లతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసీపీ తెలిపారు.
శ్రీకోవెల రంగనాయక స్వామి జాతర
నార్సింగి, జనవరి 12: చారిత్రత్మకమైన శ్రీకోవెల రంగనాయక స్వామి ఆలయంలో నేటి నుంచి జాతర కొనసాగనుంది. కార్వాన్ నియోజకవర్గం నానల్‌నగర్‌లో ఆలయం ఉంది. ఆలయంలోని కోనేరులో స్నానం ఆచరిస్తే చర్మవాధులు మాయమవుతాయని భక్తుల నానుడి. దేవాలయం పూరతనమైనది. దేవాలయంలో రెండు కోనేరులు ఉన్నాయి. ప్రజలకు జబ్బులు వస్తే ఈ దేవాలయానికి వచ్చి కోనేరు(గుండం)లో స్నానం ఆచరించి, దేవాలయం చుట్టు ఐదు ప్రదక్షణలు చేస్తే స్వామివారి మహిమతో జబ్బులు నయం అవుతాయని స్థానికులతో పాటు ట్రస్టు కమిటీ మాజీ నిర్వాహకులు ఎం.నర్సింగ రావు, సభ్యులు జగన్నాథం, ఏ.యాదయ్య, జనార్దన్, విజయబాబు తెలిపారు. గతంలో లంగర్‌హౌస్‌కు చెందిన ఓ వ్యక్తి జబ్బుతో బాధపడుతుండగా కోనేరులో స్నానం ఆచరించి, ఐదు ప్రదక్షణలు చేయడంతో అతని జబ్బు నయమైందని స్థానికులు తెలిపారు.
సంక్రాంతి ఉత్సవాలు
దేవాలయంలో ప్రతి సంక్రాంతి పండుగ పురస్కారించుకుని మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. శనివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం వరకు మూడు రోజుల పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయి. దేవాదాయ శాఖ ఇవో మహేందర్ రెడ్డి ఏర్పాట్లు సమీక్షించారు. దేవాలయంలో శనివారం పది గంటల నుంచి మహిళల కోసం రంగోళి, ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. విజేతలకు సంక్రాంతి పండుగ రోజున బహుమతులను అందజేస్తారు.