రంగారెడ్డి

వైభవంగా ఘణపూర్ క్షేత్రగిరి జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జనవరి 16: మేడ్చల్ - శామీర్‌పేట్ మండల ప్రజల ఆరాధ్య దైవం కల్పవృక్షణ శ్రీక్షేత్రగిరి వెంకటేశ్వరస్వామి జాతర మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది.
మండలంలోని ఘణపూర్ పరిధిలోని ఎతైన గుట్టలపై పచ్చని ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినం నుంచి ప్రారంభమవుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కనుమ పండుగ రోజు స్వామివారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. మంగళవారం స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని పల్లకీ సేవ ఊరేగింపు తదితర కార్యక్రమాలను నిర్వాహకులు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవాడానికి భక్తు లు పెద్ద సంఖ్యలో తెల్లవారుఝాము నుంచి బారులు తీరారు. భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తరించారు. స్వామి వారి జాతర సందర్భంగా క్షేత్రగిరి గుట్ట పరిసరాలు వేలాది భక్తుల రాకతో కిక్కిరిసిపోయింది. ఇక్కడి గుట్టపై ఆధ్యాత్మిక భక్త్భివం వెల్లివిరియడంతో పాటు గుట్టపై గత ఏడాది గోదావరి జలాలను నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించడానికి నిర్మించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి దర్శించుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల సౌకర్యార్ధం నిర్వాహకులు తాగునీటి వసతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పేట్‌బషీరాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మేడ్చల్, శామీర్‌పేట్ మండలాలకు చెందిన పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, శామీర్‌పేట్ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, రాజబొల్లారం సర్పంచ్ నారాయణ గౌడ్, పూడూరు సర్పంచ్ కోల స్రవంతి, టీఆర్‌ఎస్ నాయకులు సుదర్శన్, మోనార్క్, శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వరదారెడ్డి, నాయకులు బాలమల్లేశ్, రాగజ్యోతి, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పిక్కట్ కృష్ణ, పోచయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది మోహన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు జగన్ గౌడ్, నాయకులు అర్జున్, రమేశ్, మహేశ్, శ్రీనివాస్, శ్రీరాములు, భాస్కర్ ఉన్నారు.