రంగారెడ్డి

ఆటో బోల్తా ..ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, జనవరి 16: ఆటో బోల్తా పడి ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. మీర్‌పేట్ ఎస్సై మైసూదిన్ తెలిపిన వివరాల ప్రకారం.. బడంగ్‌పేట్ శ్రీనిలయం టౌన్‌షిప్‌లో నివాసం ఉండే బెరిన్ నితీష్ కుమార్(18), తివారి మాధవ్(16), హరీష్, తరుణ్ ఉదయం దాదాపు 7:30 గంటలకు నాదర్‌గూల్ నుంచి శ్రీనిలయం టౌన్‌షిప్‌కు ఆటోలో వస్తున్నారు. శ్రీనిలయం టౌన్‌షిప్ దగ్గర ఇండియన్ పెట్రోల్ పంపు ఎదురుగా ఆటో బోల్తాపడి అదుపుతప్పి ఎదురుగా కారును ఢీకొట్టింది. ఆటోలోని నీతీష్ కుమార్, మాధవ్ మృతిచెందగా, హరీష్, తరుణ్‌కు గాయాలు అయ్యాయి. ఆటో అదుపు తప్పి రెండు పల్టీలు కొట్టి, ఎదురుగా వస్తున్న కారుపై పడింది. దీంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డబిల్‌పూర్ మల్కచెరువులో చేపలు మృతి
మేడ్చల్, జనవరి 16: డబిల్‌పూర్ గ్రామంలోని చెరువులో చేప పిల్లలు మృతిచెందాయి. గ్రామంలోని మల్క చెరువులో మంగళవారం పెద్ద ఎత్తున మృతిచెందిన చేప పిల్లలు ఒడ్డుకు కొట్డుకురావడం కనిపించింది. సమాచారం అందుకున్న మత్స్యకారులు చెరువు వద్దకు చేరుకుని చేపల మృతికి కారణాలపై దృష్టిసారించారు. తొలుత ఏదైనా రోగంతో చేపలు మృత్యువాత పడి ఉంటాయని మత్స్యకారులు భావించారు. చెరువులో నాలుగు నెలల కిందటనే ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేపలను వదిలారు. ఇప్పడిప్పుడే ఎదుగుతున్న చేప పిల్లలు ఒక్కసారిగా మృత్యవాత పడటం పట్ల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు నెలలయితే విక్రయించుకోవడానికి వీలుగా ఉండేదని వాపోయారు. గ్రామం నుండి లింగాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో చెరువును అనుకుని ఇంజక్షన్‌లను తయారుచేసే పరిశ్రమలోని రసాయన వ్యర్ధాలతోనే చెరువులోని చేప పిల్లలు మృతిచెందాయని మత్స్యకారులు ఆరోపించారు. మత్స్యకారులు బింగి లక్ష్మీనారాయణ, నర్సింహా, శ్రీనివాస్, మల్లేశ్, వెంకటేశ్, రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.