రంగారెడ్డి

మంజూరైన పనులకే మళ్లీ మంజూరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, జనవరి 17: నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అహర్నిషలు కృషి చేస్తూ మంజూరు చేయించిన పనులను తామే మంజూరు చేయించినట్లుగా టీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు జరుపుకోవడం సిగ్గు చేటని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి మండిపడ్డారు. బుధవారం కొడంగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తిరుపతి రెడ్డి మాట్లడుతూ కొడంగల్ నియోజకవర్గానికి మంజూరైన పనులను కాగితాల్లోంచి కార్యరూపం దాల్చకుండా ఇన్నాళ్లు అడ్డుకున్న సీఎం కేసీఆర్‌కు ఒక్కసారిగా కొడంగల్‌పై ప్రేమ ఎందుకు కలిగిందో ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కొత్తగ ఇస్తున్నట్లు ప్రకటించిన కోస్గి బస్ డిపో 2014లోనే మంజూరైందని, అప్పటి సంస్థ చైర్మన్ సత్యనారాయణరావు కూడ కార్యక్రమానికి హాజరైనట్లు గుర్తుచేశారు. తాము స్వయంగా నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి బస్‌డిపో నిర్మాణానికి విరాళంగా ఇవ్వడంతో పాటు రెండు కోట్ల నిధులు కూడ మంజూరు చేయించినట్లు వివరించారు. కొడంగల్ పట్టణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు 2017లోనే అనుమతులు వచ్చాయని, విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు సైతం గేయిల్ సంస్థతో మాట్లాడి నిధులు సమకూరిస్తే పనులను అడ్డుకున్నది టీఆర్‌ఎస్ నాయకులేనని అన్నారు. తాగు, సాగునీటికి 69 జీవో ప్రకారం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 2014లోనే మంజూరు చేస్తూ రూ.14.50 కోట్ల నిధుల మంజూరు చేయడంతో పాటు పరిపాలన అనుమతులు కూడ వచ్చినట్లు పేర్కొన్నారు. వికారాబాద్ - కృష్ణా రైల్వేలైన్ మంజూరైన పనులు జరుగకుండా సీఎం షేషీలో తొక్కిపెట్టిన విషయం వాస్తవం ప్రజలకు తెలుసన్నారు. మినీ స్టేడియం, ఐటీఐ, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మంజూరు కాగితాలకే పరిమితం చేశారని అన్నారు.
రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మంజూరుతో పాటు రోడ్డు సౌకర్యం లేని 47 గ్రామ పంచాయితీలకు రోడ్డు నిర్మాణం పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిన కార్యాలయాలను తిరిగి ఇక్కడే ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, నర్సింగ్ భాన్‌సింగ్, వెంకట్‌రాములు గౌడ్, జయకృష్ణ, వెంకట్ రెడ్డి, రాజేష్ రెడ్డి, రాంచంద్రా రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.

అదుపుతప్పి వాహనం బోల్తా: 10 మందికి గాయాలు

బొంరాస్‌పేట, జనవరి 17: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చిన వారందరూ పండుగ ముగియడంతో తిరిగి పనులు చేసుకునేందుకు కొడంగల్ నుంచి హైదరాబాద్‌కు బుధవారం సాయంత్రం తుపాన్ వాహనంలో బయలుదేరారు. మండల పరిధిలోని తుంకిమెట్ల దాటగానే అదుపు తప్పిన వాహనం బోల్తాపడింది. వాహనంలో ప్రయాణిస్తున్న మద్దూర్ మండల పరిధిలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, సావిత్రి, అలివేలమ్మ, సాయిలు, శ్రావణి, కేశవులు, శ్రీవేణిలతో పాటు దౌల్తాబాద్ మండలం పెద్దపసులోది గ్రామానికి చెందిన శశికళ, సైదులు, కొస్గిమండలం బిజ్జారం గ్రామానికి చెందిన వేణుగోపాల్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీవేణి(4) అనే చిన్నారి తలకు బలమైన గాయం కావడంతో తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. పండుకని వచ్చి ఇక్కడి నుంచి సరుకులు, బియ్యం బస్తాలు వేసుకొని బయలుదేరారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.