రంగారెడ్డి

గ్రామీణ జానపద కళాకారులను ప్రోత్సహించాలి: విద్యాసాగర్ రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 17: సినీ రంగ ప్రముఖులను సన్మానించినట్లు తెలుగు రాష్ట్రాలలో ఉన్న గ్రామీణ జానపద కళాకారులను ప్రోత్సహించాలని మహారాష్ట్ర గవర్నర్ కే.విద్యాసాగర్ రావు సూచించారు. టీఎస్‌ఆర్ లలిత కళాపరిషత్‌ను తెలంగాణలో కాకతీయ కళాపరిషత్‌గా ఏర్పాటుచేసిన సుబ్బిరామిరెడ్డి కాకతీయ కళావైభవ మహోత్సవం పేరుతో ప్రముఖ నటుడు మోహన్‌బాబుకి విశ్వనట సార్వభౌమ బిరుదును ప్రకటించారు. అవార్డు ప్రదాన కార్యక్రమానికి విద్యాసాగర్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన సినీ కళాకారులకు అవార్డులు అందిస్తున్న సుబ్బిరామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోని జానపద కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. తెలుగు జాతిని సంస్కృతిని కాపాడడానికి కాకతీయులు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. తెలుగు పదజాలాన్ని సున్నితంగా వల్లించడం మోహన్‌బాబుకే సాధ్యమని కొనియాడారు. 560 పైచిలుకు సిసిమాల్లో నటించి తెలుగు ప్రజల అభిమానాన్ని పొందిన మోహన్‌బాబు అవార్డుకు నిజమైన అర్హుడని చెప్పారు. అవార్డు గ్రహీత మోహన్‌బాబు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహిస్తున్న టీఎస్‌ఆర్ లలిత కళాసమితి.. తెలంగాణలో కాకతీయ కళాపరిషత్‌ను ఏర్పాటుచేసి మొదటిసారిగా తనకు విశ్వనట కళాసార్వభౌమ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పారు. సినీ రంగంలో తనను ప్రోత్సహించిన ఎన్‌టీఆర్‌ని, దాసరి నారాయణ రావును గుర్తు చేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు, కాకతీయ కళాపరిషత్ వ్యవస్థాపకుడు టీ.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ప్రజలను ఆహ్లాదపరచడంలో ఆనందం ఉందని తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసుదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు జితేందర్ రెడ్డి, డీ.శ్రీనివాస్, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, సినీనటులు బాలకృష్ణ, బ్రహ్మనందం, ఆలీ, జయప్రద, జయసుధ, శ్రేయతోపాటు పలువురు ప్రముఖులు రాఘవేందర్‌రావు, రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. తెలంగాణలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారికి ప్రతిభా పురస్కారాలను అందజేసారు.