రంగారెడ్డి

రోడ్లు, బ్రిడ్జి నిర్మాణాల పనుల వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 17: పంచాయతీరాజ్, రోడ్లు భవనాల నిధులతో చేపట్టిన రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల పనులను రెండు, మూడు నెలల్లో పూర్తయ్యేలా పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల పనులు నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ఏఈల పనితీరును మెరుగు పర్చుకోవాలని, తమ వద్ద ఉన్న పెండింగ్ పనుల వివరాలకు నివేదికలు రూపొందించి వారంలోగా తనకు సమర్పించాలని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు తీసుకున్న పనులను సకాలంలో పూర్తి చేయనట్టయితే అట్టి పనులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. తమకు కేటాయించిన పనులు చేయలేని పక్షంలో వాటిని వదులుకోవాలని సూచించారు. మంజూరైన పనులకు నిధులు రావడం ఆలస్యమవుతుందని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకురాగా దీనిపై మంత్రి స్పందిస్తూ ఇలాంటి విషయాలను సంబంధిత ఇంజనీర్లు తనకు ఎప్పటికపుడు తెలియజేస్తే నిధుల విడుదలకు కృషి చేస్తామని అన్నారు. జరుగుతున్న పనుల విషయంలో తనకు ఎప్పటికపుడు సమాచారం ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్న ఇంజనీర్లపై మండిపడ్డారు. కాంట్రాక్టర్లు పనులను నిలిపివేయకుండా చేపట్టాలని, నిధులు త్వరలో వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రూ.9.20 కోట్ల వ్యయంతో చేపడుతున్న తాండూర్-నారాయణపూర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేసి ఆరు నెలల్లో పూర్తయ్యేలా చూడాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. ఇప్పటికీ తాండూర్ మండలంలో పనులు మంజూరైన గౌతాపూర్ నుండి పర్వతాపూర్, హన్మాపూర్ ఎక్స్ రోడ్డు నుండి సంకిరెడ్డిపల్లి, ఉద్దండాపూర్ నుండి మైసమ్మ తాండ పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయిన వాటిని ప్రజల సౌకర్యార్థం ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్ ఎస్‌ఇ హన్మంత్‌రావు, ఈఈ మనోహర్, డీఈఈ వెంటేశ్వరరావు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

నిబద్ధతతో యువ ఐఏఎస్‌లు పనిచేయాలి: కలెక్టర్ ఎంవీ రెడ్డి
కీసర, జనవరి 17: దేశ భవిష్యత్ కోసం యువ ఐఏఎస్‌లు నిబద్ధతతో పనిచేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో భారత్‌దర్శన్‌లో భాగంగా ఐఏఎస్ - 2017 బ్యాచ్‌కు చెందిన 18 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. రెండు నెలల పాటు భారత్ దర్శన్ పేరిట దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్ వివరించారు. తర్వా త కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లోని సామాజిక, ఆర్థిక, పరిస్థితుల గురించి అవగాహన చేసుకోవాలని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్‌లు పెంచటం వల్ల పరిపాలన సులభతరంగా మారిందని చెప్పారు. భూరికార్డుల ఆధునీకరణ, ట్యాంపరింగ్ ప్రూఫ్, బార్‌కోడెడ్ పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీ, మార్పులు చేర్పులు, కొనుగోళ్లు, అమ్మకాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. ముందుగా అధికారుల బృందం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఆర్‌డీఓ కౌటిల్య పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.