రంగారెడ్డి

క్యాబ్ డ్రైవర్ నిజాయితీని అభినందించిన సీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 17: క్యాబ్ డ్రైవర్ నిజాయితీని జీడిమెట్ల సీఐ శంకర్‌రెడ్డి అభినందించి సన్మానించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్, దిల్‌కుష్‌నగర్‌లో నివాసముండే షేక్ వాజీర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వృత్తిలో భాగంగా ఈ నెల 15న దిల్‌సుఖ్‌నగర్ నుండి జీడిమెట్లకు ఓ కస్టమర్‌ని క్యాబ్‌లో ఎక్కించుకుని జీడిమెట్లలో దింపాడు. అనంతరం ఇంటికి వెళ్లిన వాజీర్ కారులో చూస్తే ఓ బ్యాగ్ కనిపించింది. ఇది గమనించిన వాజీర్ సీఐడీలో హోమ్‌గార్డ్‌గా పనిచేస్తున్న అదేకాలనీకి చెందిన మహమ్మద్ నసీమ్‌తో కలిసి క్యాబ్‌లో ఎక్కిన కస్టమర్‌కు సమాచారం అందించి జీడిమెట్ల పోలీసులకు బ్యాగ్‌ను వజీర్ అప్పగించాడు. పీఎస్‌కు వచ్చిన కస్టమర్ బ్యాగులోని మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదు అలానే ఉండడం చూసి ఎంతో సంతోషించింది. ఈ సందర్భంగా జీడిమెట్ల సీఐ శంకర్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్ వజీర్ నిజాయితీని మెచ్చుకుని శాలువాతో సన్మానించి అభినందించారు. సీఐ మాట్లాడుతూ క్యాబ్ డ్రైవర్ నిజాయితీ విషయాన్ని కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన బహుమతి అందజేస్తామని అన్నారు.
గంజాయి తరలిస్తున్న దంపతుల అరెస్టు
సైదాబాద్, జనవరి 17: గంజాయి తరలిస్తున్న దంపతులను అరెస్టు చేసిన మలక్‌పేట్ పోలీసులు వారినుండి 30కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామానికి చెందిన ఉప్పు దుర్గాప్రసాద్ (39), లీలారాణి(37) మంగళవారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్ వెంకటాద్రి థియేటర్ వద్దగల బస్‌స్టాప్‌లో వేచి ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మలక్‌పేట్ పోలీసులు అక్కడికి చేరుకొని వారి బ్యాగుల్లో సోదా చేయగా 30కేజీల గంజాయి కనిపించింది. గంజాయి స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.