రంగారెడ్డి

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జనవరి 18: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రవేశ పెట్టిన ప్రజారంజక సంక్షేమ పథకాలు నేటికీ రాష్ట్రంలో కొనసాగుతున్నాయని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతిని పరస్కరించుకుని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో వేడుకలను నిర్వహించారు. వనస్థలిపురం డివిజన్ పనామా గోడౌన్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింతల సురేందర్ యాదవ్, శ్యామల ప్రసాద్, పారంద రమేష్, నూతి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్‌రెడ్డి, తూర్పాటి కృష్ణ, జగన్, నాంపల్లి రామేశ్వర్, సతీష్, కళ్లెం వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. మన్సూరాబాద్ చౌరాస్తాలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు జగన్, నాంపల్లి రామేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రంగారెడ్డి హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కీసర: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు వర్ధంతిని టీడీపీ నాయకులు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. కీసరలోని అంబేద్కర్ చౌరస్తాలో టీడీపీ జెండాను ఎగురవేసి, ఎన్‌టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండల పార్టీ అధ్యక్షుడు సుంకరి వెంకటేశ్ మాట్లాడుతూ తెలుగోడి సత్తాను ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప వ్యక్తి ఎన్‌టీ రామారావు అని కొనియాడారు. కీసరలోని వివిధ ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేసారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుంకరి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, నాయకులు అన్నంరాజు శ్రీనివాస్, వెంకటేశ్, ముత్యాలు, రమేశ్ గౌడ్, శ్రీహరి గౌడ్, ప్రభాకర్ రెడ్డి, బాల్‌నర్సింహ పాల్గొన్నారు.
వికారాబాద్: పేద బడుగు బలహీన వర్గాల పెన్నిధి నందమూరి తారకరామారావు అని టీడీపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు జీ.సుభాష్ యాదవ్ అన్నారు. గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, నాయకులు శేఖర్ యాదవ్, నాయకులు మహేందర్, శ్రీనివాస్ గౌడ్, జీ.ఉమాశేఖర్, సిరాజుద్దీన్, గొడుగు పాండు, దివాకర్ పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: దివంగత నందమూరి తారక రామారావు 22వ వర్ధంతిని గురువారం మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్లు నిర్వహించారు. భూలక్ష్మీదేవి చౌరస్తాలో ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రేగడి మైలారం అంజిలయ్య, అచ్యుతరెడ్డి, బాలకిషోర్, డీకే రాములు, హన్మంతు పాల్గొన్నారు.
మోమిన్‌పేట: బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్‌టీఆర్ ఎనలేని కృషిచేశారని టీడీపీ మండల అధ్యక్షుడు సీరాజోద్దీన్ అన్నారు. గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి, తాజ్, ఖాజాపాష, విజయ్, శ్రీనివాస్, జావిద్ పాల్గొన్నారు.
మేడ్చల్: దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ సేవలు చీరస్మణీయమని పలువురు మేడ్చల్ నాయకులు కొనియడారు. స్వర్గీయ ఎన్‌టీఆర్ వర్ధంతిని గురువారం టీడీపీ నాయకులు నిర్వహించారు. మేడ్చల్ పట్టణంతో పాటు మండలంలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ, కండ్లకోయ, అత్వెల్లి, గిర్మాపూర్ గ్రామాల్లోని ఎన్‌టీఆర్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఎస్. శ్రీనివాస్, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, నర్సింహ గౌడ్, ఆకుల సురేశ్, చాపరాజు, రంజిత్, చంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, రాము యాదవ్, శ్రీను, లింగం, కృష్ణ, వెంకటేశ్, రాము గౌడ్, సురేశ్, జైపాల్, అశోక్ రెడ్డి, గణేశ్, భాను, నర్సింగ్ పాల్గొన్నారు.
సైదాబాద్: తెలుగు ప్రజల గుండెల్లో స్వర్గీయ ఎన్‌టీఆర్ చిరస్మరనీయుడని గ్రేటర్ టీడీపీ ఉపాధ్యక్షుడు గాజుపాక జ్ఞానేశ్వర్ అన్నారు. గురువారం దివంగత ఎన్‌టీఆర్ జయంతిని పురస్కరించుకొని యాకత్‌పుర నియోజకవర్గం ఐఎస్‌సదన్ డివిజన్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సుబ్రమణ్యనగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులకు రొట్టెలు, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు ముత్యంరెడ్డి, బలవంత్ రెడ్డి, శ్రవణ్ కుమార్, పంతునాయక్, కొర్రదేవి పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీకాలనీ: ఎన్‌టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కేపీహెచ్‌బీ కాలనీలో డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు పాల్గొని ఎన్‌టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు జాస్తీ శ్రీ్ధర్, కట్టా నర్సింగ్ రావు, పద్మా చౌదరి, నారాయణరాజు, భద్రం, హరిబాబు, హనుమంత రావు, దీపక్, రాజా, సత్తార్, సాంబశివ రావు, శ్రీను, లక్ష్మీనారాయణ, రామారావు, ప్రదీప్, శంకర్, మస్తాన్, మణి, భారతి, ఉమా పాల్గొన్నారు.