రంగారెడ్డి

నాగోల్‌లో పగిలిన వాటర్ పైప్‌లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపూరం / చాంద్రాయణగుట్ట, జనవరి 28: జంటనగరాల ప్రజల దాహర్తిని తీరుస్తున్న కృష్ణా జలాల తరలింపుకు సంబంధించిన భారీ పైప్‌లైన్‌లు ఎక్కడపిడితే అక్కడ పగులుతున్నాయి. తాజాగా గురువారం రాత్రి నాగోల్ క్రాస్‌రొడ్డులోని సుప్రజ ఆసుపత్రి వద్ద 1000 ఎంఎం పిఎస్‌సి పైప్‌లైన్ పగులడంతో గ్యాలన్ల కొద్ది విలువైన నీరు రోడ్డు పాలైంది. ఆటోనగర్ నుండి ఉప్పల్ ప్రాంతానికి కృష్ణా నీటిని సరఫరాచేసే అతిపెద్ద పైప్‌లైన్ పగులడంతో నీరు రోడ్డుపై నదులను తలపించాయి. పైప్‌లైన్ పగులడంతో నీరు స్థానికంగా ఉన్న మమతనగర్ ప్రాంతాల్లో బస్తీలకు నీరు వరదలాగా వచ్చి చేరడంతో స్థానికులు తీవ్రబయందోళనకు గురయ్యారు. రాత్రి ఏడున్నర ప్రాంతంలో పైప్‌లైన్ పగులడంతో రోడ్డుపై వేళ్లే రాకాపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు గంటల పాటు పైప్‌లైన్‌లో ఉన్న నీరు బయటకు రావడంతో బస్తీలు చెరువులుగా తలపించాయి. నీటిలో ఇంటి ముందు పార్క్‌చేసిన బైక్‌లు కొట్టుకు పోయాయి. విషయం తెలుసుకున్న జలమండలి డివిజన్-10 అధికారులు ఆటోనగర్ ఉన్న రిజర్వాయర్ నుండి వస్తున్న నీటి సరఫరాను నిలిపివేశారు. ఉప్పల్ తదితర ప్రాంతాలకు తరలించడానికి అవుట్‌లెట్ డిస్ట్రీబ్యూషన్‌కు సంబంధించి 1000ఎంఎం పిఎస్‌సి పైప్‌లైన్‌ను అటోనగర్ వాటర్ రిజర్వాయర్‌కు అనుసందానంగా నిర్మించారు. విషయం తెలుసుకున్న జలమండలి డివిజన్-10 అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల పనులను చేపడుతున్నారు. ఈ సందర్భంగా జలమడలి ఆపరేషన్, మెయింటనెన్స్ విభాగం డైరెక్టర్ జి.రామేశ్వరరావు పైప్‌లైన్ పగిలిన నాగోల్ క్రాస్‌రోడ్డుకు చేరుకుని మరమ్మతు పనులను పరిశీలించారు. మరమ్మతలు పనులను గురువారం అర్థరాత్రి వరకు పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. నీటి సరఫరాను నిలిపివేసి పనులు చేపడుతున్న సందర్భంగా ఈనెల 29వ తేదీ శుక్రవారంనాడు ఉప్పల్, అల్కాపూరి, ఎల్‌బినగర్, మారుతినగర్ సెక్షన్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్లు జలమంలడలి అధికారులు తెలిపారు.

హిమయత్‌సాగర్ డ్యామ్‌ను
సందర్శించిన కేంద్ర బృందం
చాంద్రాయణగుట్ట, జనవరి 28: నగరంలోని హిమయత్‌సాగర్‌ను కేంద్ర డ్యామ్ రక్షణ కమిటీ బృందం జలమండలి అధికారులతో కలిసి గురువారం సందర్శించింది. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ ఛీప్ అధికారి కె.సత్యనారాయణతో కూడిన కేంద్ర బృందం సభ్యులు హిమయత్‌సాగర్‌ను సందర్శించి పరిశీలించారు. డ్యామ్ పరిరక్షణ కోసం తీసుకుంటున్న అంశాలు, జాగ్రత్తల గురించి జలమండలి ఉన్నాతాధికారులు కేంద్ర డ్యామ్‌ల రక్షణ కమిటీ బృందానికి వివరించారు. కేంద్ర డ్యామ్ రక్షణ టీమ్ సభ్యులు ఇఇ ఎస్.శ్రీనివాసులు, సెంట్రల్ డ్యామ్ సెఫ్టీ ఆర్గనేజేషన్(సిడిఎస్‌ఓ) డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కె.అశోక్‌తో పాటు జలమండలి జిఎం కెఎన్ సాయినాథ్, డిజిఎంలు జి.రామకృష్ణ, ఎస్.హరిశంకర్, మేనేజర్ ఎం.వెంకట్‌రావు ఉన్నారు.