రంగారెడ్డి

దర్గాను అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జనవరి 18: రెండు సంవత్సరాల కాలంలో జహంగీర్ ఫీర్ దర్గాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని డిప్యూటి సీఎం మహామూద్ అలీ తెలిపారు. గురువారం జహంగీర్ ఫీర్ దర్గా ఉర్సు ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం , షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ హాజరై బాబాకు గందం సమర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. 50 కోట్ల రూపాయలతో దర్గాను విస్తరించడంతోపాటు వౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. దర్గాను అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారని వివరించారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, హైదరాబాద్ డిప్యూడి మేయర్ బాబా ఫసీయోద్ధిన్, మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ అక్బరోద్ధిన్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
కొత్తూరు రూరల్: జహంగీర్ ఫీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ చెప్పారు. గురువారం కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ పంచాయతీ జహంగీర్‌పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. దర్గాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘాలో బందోబస్తును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
డబుల్ బెడ్‌రూం, మిషన్ భగీరథ పనులు సత్వరమే పూర్తి చేయాలి
కీసర, జనవరి 18: డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు, మిషన్ భగీరధ పనులు నిర్ణీత సమయానికే గుత్తేదారులు పూర్తి చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కీసర మండలం, యాద్‌గార్‌పల్లి గ్రామాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. హరితహారం మొక్కలను, గ్రామంలో పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. గొర్రెల లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి, ఆర్థికంగా ఎదగాలని, గొర్రెల ఆరోగ్య స్ధితి గతులపై ఆరాతీసారు. ప్రజల సంక్షేమం, ప్రభుత్వ పరంగా అభివృద్ధి పనులకు ప్రజలు భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రతి గ్రామాన్ని హరితగ్రామంగా మార్చాలని గ్రామస్థులను కోరారు. కార్యక్రమంలో డీపీఓ సురేశ్ మోహన్, డీఆర్‌డీఓ కౌటిల్య, సర్పంచ్ ఖలీల్. ఆర్‌అండ్‌బీ ఈఈ ధర్మారెడ్డి, జిల్లా క్రీడల అధికారి ఉపేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రమీల పాల్గొన్నారు.