రంగారెడ్డి

నేరాల నియంత్రణ ముందస్తు చర్యలకు శిక్షణ దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 20: నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, సిబ్బంది తమను తాము కాపాడుకుంటూ, నేరస్తులు, సంఘవిద్రోహ శక్తులను అదుపులోకి తీసుకునేందుకు కమగ శిక్షణ దోహదపడుతుందని వికారాబాద్ జిల్లా ఎస్‌పీ టి.అన్నపూర్ణ అన్నారు. పోలీసు స్వీయ రక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఇజ్రాయిల్ దేశ యుద్ధ విద్య కమగ, అన్ ఆర్మ్‌డు కంబాట్ ట్రెయినింగ్‌కు సంబంధించిన శిక్షణ ఇచ్చారు.
అందులో భాగంగా జిల్లాకు చెందిన పోలీసు సిబ్బందిలో ఎస్‌ఐ నరేష్, జిల్లా పోలీసు కార్యాలయంలో ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్ళకు ఆర్‌బీవీఆర్‌ఆర్ పోలీసు అకాడమీలో ఎనిమిది వారాల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణను జిల్లా ఎస్‌పీ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల నుండి మొదటి విడతలో 25 మంది కానిస్టేబుళ్లకు పది రోజుల పాటు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో డిఫెన్సివ్ పోలీస్ టాక్టికల్ ట్రెయినింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎస్‌పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ఎవరైనా అనుమానితుడిని అదుపుచేస్తూ అరెస్ట్ చేసే సమయంలో మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఎలా లాక్స్ చేయాలనే అంశాలపైనా శిక్షణ ఇవ్వబడిందన్నారు. పోలీసు సిబ్బంది గాయాల బారిన పడకుండా నేరస్తులను ఏవిధంగా అదుపులోకి తీసుకోవాలనే విషయాలకు సంబంధించి శత్రువుని నిరాయుధుడిని చేయడం, ప్రతిఘటించడం, ధీటుగా ఎదుర్కొంటూ పోరాడటం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన తాండూర్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డికి మొదటి బహుమతి, హెడ్‌క్వార్టర్ కానిస్టేబుల్ ఆంజనేయులుకు ద్వితీయ బహుమతి, ప్రశంసా పత్రాలను ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పీ పి.నర్సింలు పాల్గొన్నారు.