రంగారెడ్డి

వైభవంగా చిత్తారమ్మ దేవి జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 21: భక్త జనసందోహంలో గాజులరామారం చిత్తారమ్మ దేవి జాతర జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అభిషేకం, విజయ దర్శనం, తలంబ్రాలు, ఒడిబియ్యం, బోనాలు సమర్పించుకున్నారు. గాజులరామారం విలేజ్ నుంచి భారీ ర్యాలీగా పోతురాజుల నృత్యాలతో ఘటాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి బోనాలను, మేకపోతులను, కోళ్లను, తొట్టెలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పెద్దఎత్తున వాహనాలకు ప్రజలు ప్రత్యేక పూజలు చేయించారు. కిలోమీటరు పొడవునా భక్తులతో గాజులరామారం రోడ్డు పూర్తిగా భక్తుల రద్దీతో నిండిపోయింది. గాజులరామారం చౌరస్తా నుండి ఉషాముళ్లపూడి ఆసుపత్రి వరకు వాహనాలను ఆలయం ముందు రానివ్వకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహించారు. జాతరకు మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాజు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెరాస ఇన్‌చార్జి కొలను హన్మంత రెడ్డి, కార్పొరేటర్‌లు రావుల శేషగిరి, సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు.

త్యాగరాజ ఆరాధనోత్సవం
సనత్‌నగర్, జనవరి 21: రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదివారం త్యాగరాజ ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాగ్దేవి సంగీత విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా శ్రీవెంకటేశ్వర సంగీత కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ వందన బృందం నిర్వహించిన సంగీత కచేరి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. కచేరికి కోటిపల్లి రమేష్ మృందంగం, డాక్టర్ కేవీ కృష్ణ వయోలిన్ సంగీతాన్ని అందించారు. సంగీత విద్వాంసులు, విద్యార్థులు.. త్యాగరాజ పంచరత్న కీర్తనలు ఆలపించారు. రమణాచారిని కళాశాల ప్రిన్సిపల్ డైరెక్టర్ తాడేపల్లి ఉమాశంకర్, సుబ్బలక్ష్మి సన్మానించారు.