రంగారెడ్డి

అర్హులకు అందని పింఛన్లు: బక్కని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జనవరి 21: అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేస్తుందని, ఆచరణలో అమలు కావడం లేదని టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బక్కని నర్సింలు ఆరోపించారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో 8వ వార్డులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.
బక్కని నర్సింలు మాట్లాడుతూ 65సంవత్సరాలు దాటిన వృద్ధులకు, సదరమ్ సర్ట్ఫికెట్ ఉన్న వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు సక్రమంగా రావడం లేదని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తుందే తప్పా ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుల్లో సొంత ఖర్చులతో మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను పంచాయతీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారని వివరించారు. టీడీపీ హయాంలో జన్మభూమి, పరిసరాల పరిశుభ్రత వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ సాబేర్, అంబడి బాబయ్య, ఆనంద్, పఠాన్‌పాష, రంజీత్, సాయి, మధు, రాజు, పాష పాల్గొన్నారు.

మదాసి కుర్వలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలి

షాద్‌నగర్, జనవరి 21: మదాసి కుర్వలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం దక్షణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. అశోక్ గౌడ్ మాట్లాడుతూ మదాసీ కుర్వలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుంటే ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మదాసీ కుర్వల కులవృత్తి గొర్రెల కాపరని, ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఎస్సీ కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. మదారి కుర్వ, మదాసీ కుర్వలకు బీసీ-బీ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. జాతీయ ఎస్సీ కమిషన్ మెమో నంబర్ 1268ప్రకారం మదాసీ కుర్వలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఆదేశాలు ఉంటే తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు.
సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జీ.రాములు గౌడ్, ఎమ్మె సంతోష్, మెడిగ శ్రీను, మురళీ మోహన్, నర్సింలు, యాదగిరి గౌడ్, నవీన్ కుమార్, జగన్, శివ, మధు, సాయి, దర్శన్, రాజు, రమేష్, రఘు, సురేష్, రాజేష్ పాల్గొన్నారు.