రంగారెడ్డి

మార్కండేయ ఆలయ అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 21: అనంతగిరి శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయం ఆవరణలోని మార్కండేయ ఆలయ అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన అటవీ శాఖ సమస్యలను పరిష్కరిస్తామని రవాణా శాఖ మంత్రి డాక్టర్ పీ.మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం అనంతగిరిలోని మార్కెండేయ గుహ వద్ద ఏర్పాటు చేసిన శ్రీమార్కండేయ మహార్షి జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ మంత్రి జోగు రామన్న దృష్టికి సమస్యను తీసుకెళ్తామని, దిల్లీలో రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్‌ను కలుస్తామని చెప్పారు. మహిళల శిక్షణ కోసం భూమి సైతం కేటాయిస్తామని పేర్కొన్నారు. దేశంలో చెప్పుకోదగ్గ వస్త్రాలు నేస్తున్నది పద్మశాలీలేనని, వారానికో రోజు చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి కేటీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పద్మశాలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
ఆలయం నమోదు కాకపోవడం విచిత్రం: ఆనంద్ భాస్కర్
ఎంతో మందికి ఇలవేల్పుగా విరాజిల్లుతున్న గొప్ప క్షేత్రం అనంతగిరి అని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ అన్నారు. ఆలయ ఆభివృద్ధికి ఎన్నిసార్లు నిధులు ఇచ్చినా అవి వెనక్కి వస్తున్నాయని, దానికి కారణం కేంద్ర అటవీ, పర్యాటక శాఖ ఆధీనంలో అనంతగిరి అడవి ఉండటం, ఆ శాఖ రికార్డుల్లో శ్రీఅనంత పద్మనాభ స్వామి ఆలయం లేకపోవడం విచిత్రకరమని అన్నారు. వంద సంవత్సరాల క్రితం నిర్మించిన టీబీ శానిటోరియం, ఇటీవలే నిర్మించిన హరిత రిసార్ట్స్ శాఖ రికార్డుల్లో నమోదవగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించారు. దానిపై వాకబు చేయగా తెలంగాణ ప్రభుత్వం నుంచి విజ్ఞాపన రానందునే నమోదు చేయలేదని తెలిసిందని, అనంతగిరి క్షేత్రం విస్తరించినంత మాత్రాన అడవికి ముప్పులేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర అటవీ శాఖకు వినతి వెళ్తే ఆలయ నమోదు సాధ్యమని తెలిపారు. ఇక్కడ నుంచి మంత్రి మహేందర్ రెడ్డి ప్రయత్నించాలని ఆనంద్ భాస్కర్ మంత్రి భుజం తట్టి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణి మాట్లాడుతూ మహిళల సమావేశాలు, శిక్షణ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. చట్టసభల్లో పద్మశాలీలకు అవకాశం లభించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు చేనేత రంగానికి కేటాయించిందని వివరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ ఉన్నతావకాశాలు రావాలంటే త్యాగం తప్పనిసరి అని, ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చని పిలుపునిచ్చారు. వికారాబాద్ శాసనసభ్యుడు బీ.సంజీవ రావు మాట్లాడుతూ పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పది లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ వీ.సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమానికి పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్ అధ్యక్షత వహించగా, చేవెళ్ల శాసనసభ్యుడు కే.యాదయ్య, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, యాలాల్ పీఏసీఎస్ అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్, జిల్లా గౌరవ సలహాదారు రాములు పాల్గొన్నారు. నేత్ర, అవయవ, శరీర దాన కరపత్రాన్ని ఆవిష్కరించారు.