రంగారెడ్డి

వైభవంగా ఘట్టు మైసమ్మ జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జనవరి 21: కష్టాలు గట్టెక్కించే ఘట్‌కేసర్ శ్రీ ఘట్టు మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఘట్‌కేసర్ పంచాయతీ పరిధిలోని కొండగట్టుపై స్వయంభుగా వెలసి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతూ కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు దైవంగా ప్రసిద్ధిగాంచిన ఘట్టు మైసమ్మ జాతర ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, సార శ్రీనివాస్ గౌడ్, డైరక్టర్లు కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర టీఆర్‌ఎస్ నాయకులు మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డి, ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాఔని యాదగిరి యాదవ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుల కుమార్, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కంభం లక్ష్మారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బైనగారి నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు మేడబోయిన వెంకటేశ్ ముదిరాజ్, ప్రత్యేక పూజలు జరిపారు. భారి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి డీసీపీ ఉమ మహేశ్వరశర్మ, ఏసీపీ సందీప్, ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పీ.రఘువీర్‌రెడ్డి జాతర ఉత్సవాలలో పాల్గొని పర్యవేక్షించారు. బైపాసు రోడ్డులో వాహనాలు వెళ్లటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఘట్‌కేసర్‌లో పాత రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం జరిగి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఘట్‌కేసర్‌కు చెందిన గుండోజు కృష్ణాచారి అమ్మవారికి ముక్కు పుడకను బహుకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. జాతర ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారిణి భాగ్యలక్ష్మి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సిబ్బందిని అప్రమత్తం చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రశంసలు అందుకున్నారు. ఘట్టు మైసమ్మ తల్లి విగ్రహాన్ని గత నెలలో ధ్వంసం చేసిన దుండగులు అమ్మవారి అగ్రహానికి గురై భార్య పిల్లలు సైతం అసహ్యించుకునేలా శిక్షకు గురవుతారని భవిష్యవాణీ వినిపించారు. జాతర ఉత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన జగదీష్.. అమ్మవారి పూనకంతో భవిష్యవాణి వినిపించారు.
హామీలే తప్ప ఆచరణ శూన్యం

*మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ విమర్శ
మోమిన్‌పేట, జనవరి 21: హామీలే తప్ప అమలు విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ విమర్శిం చారు. ఆదివారం మండల పరిధిలోని ఇజ్రాచిట్టంపల్లిలో ఏర్పాటుచేసిన ‘ప్రజల వద్దకు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితున్ని సిఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూమ్ వంటి హామీలు నీటి బుడగలుగానే మిగిలాయని ఆచరణ శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేసారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇప్పటివరకు 21వేల ఉద్యోగాలు ఇచ్చారని, కేజి టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారని, ఎక్కడా అమలు చేయలేదన్నారు. మోసపూరిత మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారని, ప్రజలపై కేసీఆర్ నూట ఎనభైవేల కోట్ల రూపాయల అప్పులు మోపాడని ఆరోపించారు. మిషన్ భగీరథతో కేటిఆర్‌కు, మిషన్ కాకతీయద్వారా అల్లుడు హరీష్‌రావుకు కమీషన్ ఇవ్వడానికే ఏర్పాటు చేశారని ఆరోపించారు.
రైతులకు పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంవల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తామని, రైతుల పంటకు గిట్టుబాటు ధర పత్తికి రూ.7వేలు, కందికి 8వేలు మద్దతు ధర కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు రత్నమ్మ, శంకర్ యాదవ్, మోతీలాల్, పోచ య్య తదితరులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ
పనుల జోరు
షాద్‌నగర్, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనుల్లో పాలకవర్గం మరో అడుగు ముందుకు వేసింది. పైపులైన్లు, ట్యాంకుల ద్వారా తాగునీటిని నిల్వ చేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పనులు గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు పురపాలక సంఘంలోని 23వార్డుల్లో మిషన్ భగీరథ పథకం ట్యాంకుల నిర్మాణాలు చురుకుగా సాగుతున్నాయి. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే సంకల్పంతోనే వార్డుల వారీగా నీటి ట్యాంకుల నిర్మాణాలు జోరందుకున్నాయి. వేసవి నాటికి 50శాతం గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మిషన్ భగీరథ అధికారులు పేర్కొంటున్నారు. షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని 15వేల 963 ఇళ్లకు నల్లాల ద్వారా తాగునీరు అందించాల్సి ఉంటుందని పురపాలక సంఘం అధికారులు ఇప్పటికే సర్వే చేసి అంచనా వేశారు. పురపాలక సంఘం పరిధిలోని ఒక్కొక్క వ్యక్తికి రోజుకు సగటున 135 లీటర్ల చొప్పున నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. 2047 నాటికి జనాభా పెరుగుదల అంచనా వేసి అందుకనుగుణంగా పనులు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీటి ట్యాంకులతోపాటు మెట్రోనీటిని మిషన్ భగీరథలో అనుసంధానం చేసేందుకు 169.5 కి.మీ. పొడవున మెట్రో పైపులైన్లను వేస్తున్నట్లు అధికారులు వివరించారు. రూ.60.32 కోట్లతో ఫీడర్ పైపులైన్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. పల్లెల్లో ఇప్పటికే 50 శాతం ట్యాంకుల నిర్మాణం పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం పురపాలక సంఘంపై దృష్టి పెట్టి పనుల్లో వేగం పెంచారు. వచ్చే వేసవికల్లా మిషన్ భగీరథ స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. పైపులైన్ల ఏర్పాటులో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం కొరవడిన ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
కొనసాగుతున్న ట్యాంకుల నిర్మాణాలు
షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని కాలేజీ రోడ్, అయప్పకాలనీ, ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయ ఆవరణతో పాటు కొన్నిచోట్ల నీటి ట్యాంకులు ఉన్నాయి. కొత్తగా భాగ్యనగర్‌కాలనీలో 19లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులు నిర్మిస్తున్నారు. మల్లికార్జునకాలనీలో 7.5లీటర్ల, సర్వానీకాలనీలో 7లక్షల లీటర్ల, పురపాలిక పరిధిలో 5లక్షల లీటర్ల, సామర్థ్యం గల ట్యాంకులకు భూమి పూజ చేశారు.

బీజేపీని తిరుగులేని శక్తిగా
తీర్చిదిద్దాలి : మోహన్‌రెడ్డి
మేడ్చల్, జనవరి 21: పట్టణంలో బీజేపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలో బూత్ బూత్‌కి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాలాజీనగర్ కాలనీలో 85, 86, 87 బూత్‌లకు నూతన కమిటీలను వేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మోహన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీని బూత్‌స్థాయి నుండి మరింత పటిష్టం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభాకర్‌రెడ్డి, దాత్రిక లక్ష్మణ్, చీర్ల రమేశ్, వంశీ వంజరి, సీఎం రాజు, నర్సింగ్‌రావు, సందీప్, రఘు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సకాలంలో పనులు పూర్తిచేయరా?
* ఎమ్మెల్యే కృష్ణయ్య విమర్శ
హయత్‌నగర్, జనవరి 21: అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయడంలో కాంట్రాక్టర్లు విఫలం చెందుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. చంపాపేట్ డివిజన్ రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ధార్స్ హార్ట్‌క్లినిక్‌ను మఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్థానిక కార్పొరేటర్ సామ రమణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన, నిస్వార్ధ సేవలు అందించినప్పుడే గుర్తింపు లభిస్తుందన్నారు. అన్నివర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని వైద్యసేవలు అందించాలని సూచించారు. ఎల్బీనగర్‌లో నిర్మిస్తున్న మెట్రో రైల్ పనులు నత్తనడకన సాగుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. పనులను చేపట్టి పూర్తిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయకపోతే గుత్తెదారుల పేర్లను బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాకులు డాక్టర్ ధార్, సుమన్‌సుధా, కాలనీవాసులు వెంకట్ రెడ్డి, రఘుమారెడ్డి, రాంలక్ష్మణ్, నర్సింహ పాల్గొన్నారు.