రంగారెడ్డి

మిషన్ భగీరథకు రూ. 600 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జనవరి 22: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.600 కోట్లు మంజూరు చేశారని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఫరూఖ్‌నగర్ మండలం బుచ్చిగూడ, అన్నారంలో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మిషన్ భగీరథ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి వేసవి నాటికి తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 550 కోట్లతో 1450 చెరువులను పునరుద్ధరిస్తున్నట్టు వివరించారు. నియోజకవర్గంలో రూ. 250 కోట్లతో 213 చెరువులకు మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు. బూచ్చిగూడ, అన్నారం పంచాయతీలను షాద్‌నగర్ మున్సిపాలిటీలో కలపొద్దని మంత్రికి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ మాట్లాడుతూ సీఎం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లింగారం యాదమ్మ, ఎంపీపీ బుజ్జిబాబు నాయక్, జడ్పీటీసీ సభ్యురాలు అరుణ గోవింద్ నాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, ఆర్‌డీఓ ఎం.కృష్ణ, తహశీల్దార్ రామారావు, ఎంపీడీఓ రాజేశ్వరీ, సర్పంచులు ఉమా వెంకట్ రెడ్డి, బాలు నాయక్, ఎంపీటీసీ సభ్యురాలు స్వప్న, సూర్యప్రకాష్, ఆకుల మల్లేష్, వెంకట్‌రాం రెడ్డి, జాంగారి రవి, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధిలో అగ్రగామి తెలంగాణ
కేశంపేట: దేశంలోని 29 రాష్ట్రాలలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోందని రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కేశంపేట మండలం నిర్ధవెల్లిలో కుర్మలకు గొర్రెలు, రజకులకు ధోబీఘాట్లు, తొమ్మిది మంది దళితులకు మూడు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నీటి ట్యాంకుల నిర్మాణాలు గ్రామాలలో ఇప్పటికే 50 శాతం పూర్తి అయ్యాయని, త్వరలోనే పనులు పూర్తి చేసి నీటి నిల్వల సామర్ధ్యం పెంచుతున్నట్టు పేర్కొన్నారు. కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం పీద్దపీట వేస్తోందని గుర్తు చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో 1117మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ కింద ఐదు కోట్ల రూపాయలు ఇచ్చామని అన్నారు. ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు ఇవ్వని హామీలనూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎందేనని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శ అందె బాబయ్య, జడ్పీటీసీ సభ్యుడు పల్లె నర్సింగ్‌రావు, వైస్ ఎంపీపీ పీ.సురేందర్, సర్పంచ్ ఫణి, ఆర్‌డీఓ కృష్ణ, తహశీల్దార్ లావణ్య, ఎంపీడీఓ పద్మజ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, నాయకులు జమాల్ ఖాన్, యాదగిరి, శేఖర్‌పంతులు, రాములు, నారాయణ రెడ్డి పాల్గొన్నారు.