రంగారెడ్డి

రవాణా వ్యవస్థ పటిష్టతకు హెచ్‌ఎండీఏ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 22: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాకారం చేసేందుకు రానున్న 25 ఏళ్లలో పెరుగనున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రభావిత ప్రాంతాలలో రీజినల్, లోకల్ రవాణా వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు అవసరమైన పథకాలను రూపొందిస్తోంది. మల్టీ మాడల్ లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఇంటర్ సిటీ బస్ టర్మినల్స్, ట్రక్ టర్మినల్స్, ఎంఎంటీఎస్, ఇంటర్ సిటీ బస్‌స్టేషన్ వంటి రవాణా వ్యవస్థల ఏర్పాటుకు ప్రాజెక్టు రిపోర్ట్‌ను తయారుచేసే పనులను లీ అసోసియేషన్‌కు అప్పగించింది. సోమవారం తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయంలో ‘లీ’అసోసియేషన్ ప్రతినిధి బీఎం శెట్టి తయారుచేసిన ప్రాజెక్టు నివేదికను పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ కమిషనర్ చిరంజీవులకు వివరించారు. మరిన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ ప్రతినిధులు, రోడ్ల భవనాల అధికారులు, తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో చర్చించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాజా ప్రతిపాదనలను తయారు చేయాలని ఆదేశించారు.