రంగారెడ్డి

ప్రధాని మెచ్చిన రాష్ట్రం తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, జనవరి 22: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రథమ స్ధానంలో ఉంటుందని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఒప్పుకోవడం గర్వించదగ్గ విషయమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లిలోనూతన తహశీల్దార్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రితో పాటు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. వంశీచంద్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 602 గ్రామాల్లో భూప్రక్షాళన చేపట్టి 90శాతం వరకు పూర్తి చేసినట్లు, రాష్ట్రంలో రెవెన్యూ శాఖ చాలా కష్టపడి పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రజల కష్టాలను తప్పకుండా తీరుస్తుందని, రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజాపక్షపాతిగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని అన్నారు.
నాల్గున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో సుపరిపాలనతో అన్ని వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. నిధులు, నీళ్ళు, నియమకాల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా అపర భగీరధుడిలా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయరంగంపై ఆధారపడి సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఎకరాకు వచ్చే మార్చి నుండి 4 వేల రూపాయల చొప్పున ఒక పంటకు నగదు అందిచనున్నట్లు ఆయన తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని 3 మండలాలకుగాను కల్యాణ లక్ష్మీ పథకం క్రింద 628మందికి నిధులు అందించిన్నట్లు సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ధార్ కార్యాలయానికి భూమి విరాళంగా ఇచ్చిన లయన్స్‌క్లబ్ సునంద అంజయ్య గుప్తలను ఉప ముఖ్యమంత్రి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్‌రావు, డిప్యూటీ కలెక్టర్ సుంధర్ అబ్నార్, ఆర్‌డివో రవీంధర్‌రెడ్డి ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, జెడ్‌పీటీసీ నర్సింహ్మ, సర్పంచ్ నిర్మల జంగయ్య, తలకొండపల్లి తహసీల్ధార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసచారి, తలకొండపల్లి రైతు సమన్వయ సమితి దశరథనాయక్, షాద్‌నగర్ టి ఆర్ ఎస్ నాయకుడు అందె బాబయ్య పాల్గొన్నారు.