రంగారెడ్డి

ఆఖరి దశలో మిషన్ భగీరథ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జనవరి 22: జిల్లాలో మిషన్ భగీరథ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయని కలెక్టర్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. సోమవారం తాండూరు ఆర్డీవో కార్యాలయంలో జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథలో మొత్తం 69 నిర్మాణాలకు 60 పూర్తయ్యాయని, తొమ్మిది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. అర్హత కలిగిన 215 గ్రామాలను పంచాయతీలుగా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు చేశామని చెప్పారు. జూన్ నుంచి హరితహారం మొక్కల నాటివేత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తాండూరు - వికారాబాద్ ఫోర్‌లైన్ ప్రధాన రహదారి విస్తరణ పనులు వేగవంతం చేశామని, నాణ్యతపై నిఘా పెట్టామని వెల్లడించారు.
ప్రజావాణికి 59 ఫిర్యాదులు
ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణిలో ప్రజల నుంచి 59 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ జలీల్, ఆర్డీవో వేణుమాధవ రావు వెల్లడించారు.

సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ
గచ్చిబౌలి, జనవరి 22: సినీ నటి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. సంక్రాంతి పండుగకు చెన్నై వెళ్లి తిరిగి వచ్చేసరికి 10లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. ఆర్‌కే సెల్వమణి, పోలీసుల కథనం ప్రకారం రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిథిలోని పంచవటి కాలనీలోని ప్లాటు నెంబర్ 57లో వైఎస్‌ఆర్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా నివాసముంటున్నారు. సంక్రాంతి పండుగకు రోజా కుంటుంబ సభ్యులు 11న చెన్నైకు వెళ్లారు. మొదటి, రెండు అంతస్తుల్లో రోజా కుటుంబం నివాసముంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాలయం, పని మనిషి రామలక్ష్మి నివాసముంటున్నారు. 11న రోజా కుటుంబం చెన్నైకి వెళ్లగా 12న పని మనిషి రామలక్ష్మి ఊరు వెళ్లింది. పని మనిషి రామలక్ష్మి 18న ఊరునుండి వచ్చినప్పటికి ఆదివారం ఉదయం వరకూ పైకి పోలేదు. ఆదివారం మధ్యాహ్నం రామలక్ష్మి ఇంటిని శుభ్రం చేయడం కోసం పైకి వెళ్లి చూడగా ఇంట్లో వెండి కంచాలు కనబడక పోవడంతో పాటు బెడ్‌రూమ్‌లోని బీరువా పగలగొట్టి ఉండడంతో రోజాకు సమాచారం ఇచ్చింది. రోజా భర్త సెల్వమణి వచ్చి చూడగా బీరువాలోని 16 తులాల బంగారం ఆభరణాలు, వెండి వస్తువులతోపాటు ఒక డైమండ్, 20వేలు నగదు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫింగర్ ప్రింట్ నిపుణులు వేలిముద్రలను సేకరించారు. వేసిన తాళం వేసినట్లు ఉండడం ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంపై గతంలో ఇంట్లో పనిచేసినవారే దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్వమణి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన ప్రదేశాన్ని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ సందర్శించారు.