రంగారెడ్డి

ఇక అక్రమ నిర్మాణాల నియంత్రణ హెచ్‌ఎండీఏ పక్కా ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 22: హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న అక్రమ కట్టడాలను నియంత్రించడానికి ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని జోడించి పక్కా ప్రణాళికతో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ముందుకు వెళ్తుంది. అక్రమ కట్టడాలను కూల్చడంతోపాటు వాటిని నియంత్రించడానికి ఆన్‌లైన్ పర్యవేక్షణ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ అక్రమ నిర్మాణాల లేఅవుట్‌ల సమాచారం మేనేజ్‌మెంట్ సిస్టమ్ పేరిట ఓ వెబ్ బేసిడ్ వ్యవస్థను తయారు చేస్తుంది. సామాన్యుడు సైతం తమ వద్ద అక్రమ కట్టడాలకు సంబంధించిన సమాచారం ఉంటే హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత కట్టడాల ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి ఫిర్యాదు చేయవచ్చని హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు. సోమవారం తార్నాకలోని కేంద్ర కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ప్రతినిధులతో పాటు సంబంధిత విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న శ్రేష్ఠ టెక్ సొల్యూషన్స్ కంపెనీ ప్రతినిధులు తయారు చేసిన ప్రెజెంటేషన్‌లో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే అక్రమ కట్టడాలను తనిఖీ చేసి నిర్మాణాలను పరిశీలించి పంచనామా ప్రతులను ఇక్కడి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విధం వెబ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్‌ను తయారు చేయాలని సూచించారు. అక్రమ కట్టడాన్ని సందర్శించిన అధికారి ఎవరని, ఎప్పుడు పరిశీలించారో పరిశీలనలో బహిర్గతమైన వివరాలు ఉన్నాయా లేదా లేకపోతే స్థానిక ప్రజల సమక్షంలో పంచనామా నిర్వహించి అక్కడే సదరు అధికారి ఆన్‌లైన్‌లో నిర్మాణంకు సంబంధించిన సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని తెలిపారు. కూల్చివేసిన అక్రమ కట్టడాలపై తర్వాత కూడా నిఘా ఏర్పాటు చేయడానికి స్థానిక సంస్థల అధికారులకు సమాచారం వెళ్తుందన్నారు. సమావేశంలో చీఫ్ ప్లానింగ్ అధికారులు నరేందర్, శ్రీనివాస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి సుబ్రమణ్యం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్‌పీ ఎంఎఫ్ రహమాన్, శ్రేష్ట సొల్యూషన్ కంపెనీ సీఇఓ అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు :
*చిన్నారి పరిస్థితి విషమం
జీడిమెట్ల, జనవరి 22: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలైన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వనపర్తికి చెందిన మహేశ్వర చారి, మాధురి దంపతులకు గౌతమ్ (8), స్నేహ (6) సంతానం. మల్లంపేట్‌లో స్థిరపడిన మహేశ్వర చారి.. రెడ్డీస్ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మాధురి అరుణోదయ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుంది. బాచుపల్లిలోని గీతాంజలి స్కూల్‌లో గౌతమ్, స్నేహ చదువుకుంటున్నారు. సోమవారం స్కూల్ బస్సు రాకపోవడంతో మాధురి స్నేహితురాలు శ్రీదేవితో పాటు గౌతమ్, స్నేహను తీసుకుని మల్లంపేట్ నుంచి బాచుపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుంది. హైరైస్ కాలనీ నుంచి కారు బాచుపల్లి రోడ్డుకు వెళ్తూ మాధురి స్కూటీని ఢీకొట్టింది. ఘటనలో మాధురి కుమార్తె స్నేహ తలకు బలమైన గాయాలయ్యాయి. స్నేహ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.