దక్షిన తెలంగాణ

పోచంపల్లి ‘ఇక్కత్’ అద్భుతం .. గవర్నర్ నరసింహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 7: పోచంపల్లి ఇక్కత్ చేనేత కళ ఎంతో అద్భుతంగా ఉందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కొనియాడారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలాన్ని ఆయన సతీమణి నిర్మలా నరసింహన్‌తో కలిసి సందర్శించారు. రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, హ్యాండ్లూమ్ పార్క్ చైర్మన్ కడవేరు దేవేందర్, సీత దామోదర్ గవర్నర్‌కు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్ మగ్గాలపై తయారుచేస్తున్న చేనేత వస్త్రాలు, కార్మికుల జీవన స్థితిగతులు, గిట్టుబాటు ధరలను అడిగి తెలుసుకున్నారు. హ్యాండ్లూమ్ పార్కులో వార్పు, రంగులద్దడం, చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను ఆయన పరిశీలించారు. మగ్గాలపై తయారుచేస్తున్న వస్త్రాలను చూసి అబ్బురపడ్డారు. పార్కులో ఎంత మంది పని చేస్తున్నారు.. ఎంత కూలీ వస్తుంది.. వస్త్రాల మార్కెటింగ్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం టూరిజం పార్కులో కార్మికులు, మాస్టర్ వీవర్ బ్యాంకర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. చేనేత రంగం అభివృద్ధికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా ఏం చేయాలని అడిగారు. గవర్నర్ మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. చేనేత కళ కష్టమైన పని అని, నిజంగా స్కిల్ వర్క్ అంటే చేనేతే అని కొనియాడారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కావాల్సిన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్‌కు అనుగుణంగా నూతన డిజైన్లు రూపొందిస్తే అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. పట్టణాలకు విస్తరిస్తే అందరూ చేనేత వస్త్రాలు ధరించే వీలుంటుందన్నారు. అనంతరం జలాల్‌పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించారు. స్వయం ఉపాధి శిక్షణా కోర్సులను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో నరసింహన్ మాట్లాడుతూ చదువుతో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు రాణించాలంటే నైపుణ్యంతోపాటు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలన్నారు. మార్కెట్‌లో ఉపాధి అవకాశాలకు కొదవ లేదని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామానంద సంస్థ నిర్వహిస్తున్న ఉపాధి శిక్షణా కోర్సులు చాలా బాగున్నాయని ప్రశంసించారు. కంప్యూటర్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, నిరుద్యోగ యువత వీటిపై దృష్టి సారించాలని, పూర్తి స్థాయిలో ప్రోగ్రామ్‌లు నేర్చుకోవాలన్నారు. రాష్ట్ర చేనేత, జౌళీ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, కలెక్టర్ అనితా రామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రవినాయక్, రామానంద తీర్థ సంస్థ డైరెక్టర్ కిశోర్‌రెడ్డి, క్యాంపస్ ఇన్‌చార్జి హన్మంత రావు, డీఆర్‌డీవో వెంకట్రావ్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.
chitram...
భూదాన్‌పోచంపల్లిలో చేనేత కళాకారులను పరామర్శిస్తున్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్