కృష్ణ

పీఏసీఎస్ ద్వారానే కేడీసీసీ బ్యాంక్‌కు రూ. 870 కోట్ల డిపాజిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదినేపల్లి, ఫిబ్రవరి 12: కేడీసీసీ బ్యాంక్ డిపాజిట్లలో రూ. 870 కోట్లు కేవలం కార్మిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ద్వారానే వచ్చినవి డిపాజిట్ల ద్వారా పీఏసీఎస్‌లు బంగారు ఆభణాలపై అప్పులు ఇవ్వచ్చని, తద్వారా సంఘాలు లాభాల బాటలో పయనిస్తాయని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. ముదినేపల్లి కేడీసీసీ బ్యాంక్ పరిధిలోని 15 పీఏసీఎస్‌ల వ్యాపార అభివృద్ధి, వసూళ్లపై ఆయా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో సోమవారం సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ పరిధిలోని పీఏసీఎస్‌లు దీర్ఘకాలిక రుణాలు ఆర్‌సీఎఫ్ స్కీం కింద తక్కువ వడ్డీకే ఇస్తున్నందున దీనిని సద్వినియోగం చేరుకుని ఎక్కువ మంది రైతులు లబ్ధిపొందేలా తగు చర్యలు చేపట్టాలని పీఏసిఎస్ అధ్యక్షులు, కార్యదర్శులను ఆదేశించారు. కేడీసీసీ బ్యాంక్ వ్యాపారాభివృద్ధిలో వ్యాపార పరిణామంలో మూడవ స్థానంలో ఉందన్నారు. పీఏసీఎస్‌లలో రుణాలు ఇవ్వటంతోపాటు డిపాజిట్ల సేకరణ కూడా జరగాలన్నారు. సంఘాలు ఎదుర్కొంటున్న వ్యాపార అంశాలు, సంఘాలు నష్టాలు రావటానికి గల కారణాలు, సభ్యుల వద్ద నుండి రావాల్సిన బాకీల కంటే సంఘం బ్యాంక్‌కు చెల్లించవలసిన బాకీలే ఎక్కువగా ఉన్నందుకు గల కారణాలను పీఏసిఎస్‌ల అధ్యక్షులు, కార్యదర్శులతో వివరంగా సమీక్షించారు. వ్యాపారాభివృద్ధికి గల అవకాశాలను సంఘ అధ్యక్షులతో చర్చించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కేసీసీసీ బ్యాంక్ సీఈవో కేఎస్ సుబ్రహ్మణ్యం, డీజీఎం వీఎల్ చంద్రశేఖర్, ఓఎస్‌డీ ఏ శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్ ఈ శ్రీనివాస్, బ్యాంక్ మేనేజర్ వీ సోత్రరాజు, సూపర్ వైజర్ పీ సురేష్‌బాబు, ఆయా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.