రంగారెడ్డి

కీసరగుట్ట కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 13: భక్తుల శివనామస్మరణతో కీసరగుట్ట పరిసర ప్రాంతం మార్మోగింది. మంగళ వారం మహాశివ రాత్రిని పురస్కరించుకొని రామ లింగేశ్వరస్వామిని దర్శించుకొని పునీతులయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన శివ భక్తులతో కేసరిగిరి క్షేత్రం కిటకిటలాడింది. తెల్లవారుఝాము నుంచి రాత్రి వరకు సుమారు రెండు లక్షల మంది భక్తులు తరలివచ్చినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయ. స్వామివారి దర్శనానంతరం భక్తులు కాశీ విశే్వశ్వరాలయం, లక్ష్మీనృసింహస్వామి, నాగదేవత, ప్రసన్నాంజ నేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. గుట్టదిగువ భాగాన ఉన్న పార్కు, చలువ పందిళ్ల కింద భక్తులు సేదదీరారు.్భవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి కల్యాణం సోమవారం రాత్రి వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య వైభవంగా జరిగింది. ప్రభుత్వపరంగా స్వామివారికి పట్టు వస్త్రాలను మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్ రెడ్డి దంపతులు సమర్పించారు. ఉత్సవాల్లో మొదటిరోజు రాత్రి స్వామివారిని నందివాహన సేవలో కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి చేరుకుంటారు. వేదపండితులు నిర్ణయించిన సుముహూర్తానికి రామలింగేశ్వర స్వామి కల్యాణం వైభవంగా జరిపించారు. రాజగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా వివిధ రకాల పూలతో అలంకరించిన వేదికపైన వేదపండితులు స్వామివార్ల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. కలెక్టర్ ఎంవీ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్యూలైన్లు, స్వామివారి మంటపంలో, ప్రసాదం కౌంటర్‌ల వద్ద, ప్రోటోకాల్ క్యూలైన్లు, పార్కింగ్ , తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించటంతో అన్ని శాఖలు అప్రమత్తంగా విధులు నిర్వహించాయ.
రెండింతలు పెరిగిన పండ్ల ధరలు
షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 13: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పండ్ల ధరలు ఒక్కసారిగా చుక్కలను అంటాయి. మంగళవారం మహాశివరాత్రి కావడంతో పండ్ల ధరలకు రెక్కలు రావడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. గతంలో కంటే రెండింతలు ధరలు పెరిగిపోవడంతో ఎలా కొనుగోలు చేయాలని సామాన్య ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎలాగైనా కొంటారనే ఉద్ధేశ్యంతో వ్యాపారస్థులు ఒక్కసారిగా ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినప్పటికీ పండ్ల తోటలు అంతంత మాత్రంగా ఉండటంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయని ప్రజలు పేర్కొంటున్నారు.