రంగారెడ్డి

మిషన్ భగీరథ పనులు పరిశీలించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, ఫిబ్రవరి 13: అటవీ భూముల్లో నుండి మిషన్ భగీరథ పైప్‌లైన్ వెళుతుండటంతో అటవీ అధికారులు పనులను నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సంగయిపల్లి గడ్డ దగ్గర పనులను పరిశీలించారు. అటవీ అధికారులతో తాను మాట్లాడతానని పనులు ఆపకుండా త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తుంకిమెట్ల పరిధిలోని బొట్లవానితండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయ ముఖద్వారం రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సి రావడంతో పాటు గిరిజనుల ఇళ్లు, ప్రహరిగోడలు కూడా స్వల్పంగా తొలగించాల్సి ఉండటంతో తండావాసులతో మాట్లాడారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో నిర్మిస్తున్న వాటర్‌గ్రిడ్ ట్యాంకు పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట వాటర్‌గ్రిడ్ ఈఈ పద్మలత, తహశీల్దార్ రాజేందర్‌రెడ్డి ఉన్నారు.