రంగారెడ్డి

కవులు, రచయితలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 18: కవులు, రచయితలను ప్రోత్సహిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు. రచనల చెరువు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాలలో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, త్వరలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు సాహిత్య సభను నిర్వహించనున్నామని వెల్లడించారు. జిల్లాలో సాహిత్య వాతావరణం ఏర్పడేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్నారు. కవులకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని హమీ ఇచ్చారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ రచయిత డాక్టర్ రాయారపు సూర్య ప్రకాశ్‌రావు మాట్లాడుతూ, కథా రచనలో పత్రికల వినియోగం గురించి వివరించారు. ఫ్రఖ్యాత రచయితల కథలను ఉదాహరించారు. వర్ధమాన కవులు, రచయితలు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కథా శిల్పం, వస్తువు, ఎత్తుగడ, ప్రారంభం, ముగింపు ఎలా ఉండాలనే విషయమై ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్ వీఆర్ శర్మ పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల ద్వారా కథలు చెప్పించి, రికార్డు చేయడమనే బృహత్తర కార్యక్రమాన్ని ‘పిలల్ల లోకం’ సంస్థ చేపట్టిందని వివరించారు. సమకాలీన అంశాలను రచయితలు దృష్టిలో ఉంచుకోవాలని ప్రముఖ కవి మణికొండ విజయ్ కుమార్ సూచించారు. కథా రచనలో భాషపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రముఖ రచయిత్రి రాజీవ లక్ష్మీవాసన్ అన్నారు. ‘రచనల చెరువు’ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో పలు సాహిత్య కార్యక్రమాలు చేపట్టినట్లు వేదిక అధ్యక్షుడు డాక్టర్ బెల్లంకొండ సంపత్‌కుమార్ వివరించారు. భాస్కర్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. మాసాయిపేట యాదగిరి, భట్టు వెంకన్న, నాగేశ్వర్‌రావు, వీఎం మల్లయ్య, డేవిడ్, హరికృష్ణ, సంజీవరావు, మూర్తి శ్రీదేవి, విజయశ్రీ, నర్సింగం, రవీంద్ర, ఆంజనేయులు, శ్రీశైలం పాల్గొన్నారు.