రంగారెడ్డి

ప్రశాంతతకు నిలయాలు..దేవాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 18: దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. గాజులరామారం డివిజన్ బాలయ్యనగర్‌లో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వివేక్ విచ్చేసి బస్తీ ముఖద్వారాన్ని ప్రారంభించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివేక్ మాట్లాడుతూ ఆలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆలయాలు దైవచింతనకు దోహదపడతాయని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖఃసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని పేర్కొన్నారు. కార్పొరేటర్ రావుల శేషగిరి, ఆలయ కమిటీ సభ్యులు ఎల్లయ్య, తిరుపతి, నాగేశ్, శ్యామల రావు, లక్ష్మన్, గోపాల్ సింగ్, హన్మంత రావు పాల్గొన్నారు.
ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ
జగద్గిరిగుట్ట డివిజన్ కూన మహాలక్ష్మినగర్‌లో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కేపీ వివేక్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, కూన మహాలక్ష్మినగర్ అసోసియేషన్ సభ్యులు గుంజా మహంకాళి, ఎర్రలక్ష్మయ్య, మారయ్య, వేణుయాదవ్, జైహింద్ పాల్గొన్నారు.
కుమ్మరి సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభం
గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో సీడీపీ నిధులైన రూ.10 లక్షల వ్యయంతో కుమ్మరి సంఘం భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపీ వివేక్ ప్రారంభించారు. వివేక్ మాట్లాడుతూ అన్నికులాలు, వర్గాల ప్రజల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కుమ్మరి సంఘం కులస్థులు కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగమ్మ, వీరేశంగౌడ్, నాగభూషణం, కుమ్మరి కృష్ణ, రాజేశ్, రమేశ్, నరేశ్, శ్రీశైలం, నాగరాజు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం
షాద్‌నగర్, ఫిబ్రవరి 18: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బక్కని నర్సింలు అన్నారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ ఎస్సీ కాలనీలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో, సమస్యలు పరిష్కారం అవుతున్నాయో లేదో అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నర్సింలు మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లును నిర్మించి ఇస్తామని చెప్పి నేటి వరకు ఏ ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజలకు చేసిందేమి లేదని పేర్కొన్నారు. ప్రకటనలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫరూఖ్‌నగర్ మండల టీడీపీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు ఎస్.సుభాన్ రెడ్డి, బీ.వెంకటయ్య, సత్యనారాయణ, మద్ధూరి రాజు, రామకృష్ణ, యాదయ్య, నర్సింలు, నరేష్, భాస్కర్, కుమార్, విష్ణు, బాలకృష్ణ, నాగేందర్, సాయిరాం పాల్గొన్నారు.