రంగారెడ్డి

ఇక ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 18: డిజిటల్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు, మొండిబకాయిలను నివారించేందుకు ట్రాన్స్‌కో అధికారులు డిజిటల్ ప్రీపెయిడ్‌కు శ్రీకారం చుట్టారు. విద్యుత్ మీటర్ బిగించే సమయంలో వినియోగదారుడు మొదటిసారిగా కనీసం రూ.500 రిచార్జీ చేయించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌కో అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా డిజిటల్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే ఆయా డివిజన్ కేంద్రాలకు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సారిగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే అమర్చేందుకు ట్రాన్స్‌కో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు. దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలు, గృహాలు, ఇతర వినియోగదారులకు డిజిటల్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అమర్చేందుకు కృషి చేయనున్నట్లు ట్రాన్స్‌కో ఏడీ నవీన్ కుమార్ వివరించారు. ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసేందుకు రూ.1700 ఖర్చు అవుతుందని, దీన్ని వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ మీటర్లకు కనీసం రూ.500 రిచార్జీ ఉండనున్నట్లు, రిచార్జీ చేసుకునేంత వరకు విద్యుత్‌ను వినియోగిస్తే సరి.. అంతకు మించి విద్యుత్‌ను వినియోగిస్తే ఆటోమెటిక్‌గా సరఫరా నిలిచిపొతుంది. విద్యుత్ సంస్కరణలో భాగంగా ప్రయోగాత్మకంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రీపెయిడ్ విధానంలో ముందుగా డబ్బులు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎల్‌టీ కనెక్షన్లు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ నెలలో విద్యుత్ మీటర్లు అమర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే మూడేళ్లల్లో గృహ, వాణిజ్య, ఇతర విభాగాల్లో ఉన్న విద్యుత్ మీటర్లను ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ట్రాన్స్‌కోలో ఉన్న నష్టాలు పూర్తి స్థాయిలో తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాత బకాయిలను వసూలు చేయడంతోపాటు కొత్తగా డిజిటల్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అమర్చి రిచార్జీ చేసుకున్న వినియోగదారుడికి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన పెంచేందుకు ట్రాన్స్‌కో అధికారులు కృషి చేయాలని పలువురు విద్యావంతులు పేర్కొంటున్నారు.
నష్టాలను నివారించేందుకే ప్రీపెయిడ్ మీటర్లు:ఏడీ
విద్యుత్ శాఖలో నష్టాలను నివారించేందుకే ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు షాద్‌నగర్ ట్రాన్స్‌కో ఏడీ నవీన్‌కుమార్ వివరించారు. పెండింగ్ బిల్లులు పెరిగిపోతున్నాయని, దీన్ని తట్టుకోవాలంటే ప్రీపెయిడ్ రిచార్జీ మీటర్లు ఏర్పాటు చేస్తే నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఏప్రిల్‌లో మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రజలందరు సహకరించాలని కోరారు.

వైభవంగా మల్లన్న బోనాలు
చేవెళ్ల, ఫిబ్రవరి 18: మండంలోని దామరిగిద్దలో మల్లన్న బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు యువకుల కేరింతలతో గ్రామం మార్మోగింది.