హైదరాబాద్

రేపటి నుంచి రామలింగేశుని బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 18: ప్రజల కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్య దైవం శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహోత్సవాలను మంగళవారం నుండి ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ తెలిపింది. అతి ప్రాచీమైన రామలింగేశ్వర స్వామివారి ఆలయ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొంది. రామలింగేశుని ఆలయంతోపాటు పరిసర ప్రాంతంలోని దేవతమూర్తుల ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి ఏడాది రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. 20వ తేదీన స్వామివారి ఉత్సవాలు ప్రారంభమై 26తో ముగుస్తాయి. అందులో భాగంగా 20వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలు అంకురార్పరణ, అగ్నిప్రతిష్ఠతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాత్రి 8గంటలకు నందీశ్వర సేవను నిర్వహిస్తారు. 21న భృంగీశ్వర సేవ, 22న హంసవాహన సేవ, 23న అశ్వవాహన సేవ, 24న స్వామివారి కల్యాణం, గజవాహన సేవ, అగ్నిగుండాలు, 25న రథమహోత్సవం నిర్వహిస్తారు. 26వ తేదీన దోపుసేవ, జాతర లంకా దహనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలువురు శివస్వాములు ఆలయంలో పూజాది కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దాత్రిక కాశీనాథ్ వివరించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
ఎంబీసీ, ఓబీసీ కులాలేవో తేల్చాలి

*జేఎంబీసీఎస్‌ఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంగెం సూర్యారావు

వికారాబాద్, ఫిబ్రవరి 18: సమాజంలో ఎంబీసీ, ఓబీసీ కులాలేవో తేల్చాలని అపుడే ఎంబీసీలకు న్యాయం జరుగుతుందని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంగెం సూర్యారావు అన్నారు. ఆదివారం సంఘం వికారాబాద్ జిల్లా కన్వీనర్‌గా లోకేష్‌కు, కోకన్వీనర్‌గా కుమ్మరి శ్రీనివాస్‌ను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం.. ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిందని, సమాజంలో ఓబీసీ, ఎంబీసీ కులాలేవో సందిగ్దంలో ఉండటంతో దానిపై నివేదిక ఇవ్వాలని బీసీ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఆదేశించి ఏడాది గడిచినా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయలేదని చెప్పారు. మార్చిలో చివరి బడ్జెట్ అవుతుందేమోననే భయం ఎంబీసీల్లో ఉందని పేర్కొన్నారు. ఎంత త్వరగా ఎంబీసీ కులాలను తేలిస్తే సంక్షేమ ఫలాలు త్వరితగతిన అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంబీసీ ద్వారా కొన్ని కులాలకే లాభం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో లాభం చేకూరాలంటే నివేదిక ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఎంబీసీకి ఈ ఏడాది ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం అధికార ప్రతినిధి పల్లె సత్యం, సలహాదారు కృష్ణయ్య, నాయకులు పాండు, అనంతయ్య, జగదీశ్, యాదయ్య, అనంతయ్య పాల్గొన్నారు.

కుమ్మర వృత్తికి భవిష్యత్‌లో మంచి రోజులు
ఆధునిక పనిముట్లతో కుండల తయారీ * సబ్సిడీ రుణాలు
*మోడల్ పాట్ యూనిట్ పైలెట్ ప్రాజెక్టుకు ప్రణాళికలు * మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడి

ఉప్పల్, ఫిబ్రవరి 18: కుమ్మర వృత్తికి భవిష్యత్‌లో మంచి రోజులు వస్తాయని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో జరిగిన తెలంగాణ కుమ్మర సంఘం మేడ్చల్ జిల్లా కమిటీ బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కుమ్మర్లతో పని ఉంటుందని అన్నారు. కుండలో వండిన భోజనం తింటే ఎంతో ఆరోగ్యంగా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం కనుమరుగవుతున్న కులవృత్తులతో ఎంతో నష్టం జరుగుతుందని, పూర్వ వైభవం తీసుకరావడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. శాస్త్ర విజ్జానం, టెక్నాలజీతో కుండల తయారీకి ఆధునిక యంత్రాలను అందజేసేందుకు స్టడీ జరుగుతుందని తెలిపారు. పల్లె నుంచి పట్నం వరకు కుండల తయారీని వృత్తిగా నమ్ముకున్న కుమ్మరుల కోసం మోడల్ పాఠ్ యూనిట్‌ను పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసేందుకు ప్రణాకలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అన్ని కులాలకు తల్లి పాత్రగా ప్రభుత్వం పోషిస్తుందని తెలిపారు. పేద కులవృత్తుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. గొల్ల, కురుమ తరహాలో కుమ్మర, నారుూబ్రాహ్మణ, రజక వృత్తులకు అధిక సబ్సిడీ కింద రుణాలను అందజేయనున్నట్లు వివరించారు. చట్ట సభలలో వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని అభివర్ణించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఐక్యమత్యంతో నిలిచి హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఏళ్ల చరిత్ర కల్గిన కుమ్మరులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించినపుడే అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. రాజ్యాధికారం దిశగా ఉద్యమించినపుడే భయపడి అన్ని పార్టీలు ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తాయని చెప్పారు. ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అంతరించిపోతున్న కుల వృత్తులకు ప్రభుత్వం జీవం పోస్తుందని అన్నారు. కుల వృత్తులలో పూర్వ వైభవం తీసుకరావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. 100 కులాలతో ఎంబీసీని ఏర్పాటు చేసి చైర్మన్‌గా కుమ్మర బిడ్డకు అప్పగించి గౌరవించారని చెప్పారు. గ్రామ దేవత ఆలయాలలో కుమ్మరులను పూజారులుగా నియమించాలని, ఎండోమెంట్ నామినేటెడ్ పదవుల్లో కుమ్మరులకు స్థానం కల్పించాలని, కుండకు ప్రాధాన్యతను కల్పించి సాంస్కృతిక వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అంతకు ముందు కవయిత్రి మొల్లకు జ్యోతి ప్రజ్వలన చేసి సారెపై మట్టి కుండల తయారీని ప్రారంభించారు. సంఘం అధ్యక్షుడు రామనకోల్ వీరేశం అధ్యక్షతన జరిగిన సభలో బీసీ కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, ఆంజనేయులు గౌడ్, ఎంబీసీ సీఇఓ అలోక్, తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంత్ రావు, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రాజమల్లయ్య, సంఘం ప్రతినిధులు ఆనంద్, ఆకారపు మోహన్, పీ.మల్లేష్, చిట్టిమల్ల అశోక్, శివానంద్, కిష్టయ్య, ఎల్‌బినగర్ శ్రీనివాస్, మారపాక ముత్తయ్య, రాచర్ల వెంకన్న పాల్గొన్నారు. కుమ్మర కుల బంధువు రామలింగం కళాకారుల బృందం ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఆర్టీసీ నష్టాలను అధిగమిస్తాం
*మంత్రి పట్నం వెల్లడి *తాండూరు -బెంగుళూరుకు బస్సు ప్రారంభం

తాండూరు, ఫిబ్రవరి 18: తెలంగాణ నుంచి 659 అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు నడుపుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తాండూరు నుంచి కర్నాటక రాజధాని బెంగుళూరుకు డీలక్స్ బస్సు సర్వీసును మంత్రి ప్రారంభించారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ నష్టాలలో కొనసాగుతుందని, ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీ పురోభివృద్ధికి రూ.1000 కోట్లు నిధులు కేటాయించినట్లు వివరించారు. రూ.350 కోట్లతో రాష్ట్రంలో 1407 పల్లెవెలుగు కొత్త బస్సులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 12 వందల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు లేవని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో సర్వీసులు నడపటం లేదని పేర్కొన్నారు.కాగా రూ. 60కోట్లతో రాష్ట్రంలోని అన్ని బస్టాండ్‌లను మెరుగు పరుస్తున్నట్లు, ప్రయాణికులకు అన్ని వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం గంగాధర్, డీవీఎం భవానీప్రసాద్, తాండూరు డిపో మేనేజర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.