రంగారెడ్డి

హామీలన్నీ నెరవేరుస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 20: ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
మంగళవారం గాజులరామారంలోని వీఎస్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్‌తో కలిసి మంచినీటి పైపులైన్ పనులను ప్రారంభించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే ఊహించని రీతిలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తుందని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని ఏ ఒక్కటి మరువకుండా నెరవేరుస్తున్నదని అన్నారు.
ఇంటింటికీ తాగునీరు, కోతల్లేని విద్యుత్, వ్యవసాయానికి సాగునీరు, దళితులకు మూడెకరాల స్థలం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, వెయ్యి రూపాయల పెన్షన్‌ల పంపిణీ, రైతులకు రూ.4 వేల సాయం ఇలా హామీలన్నింటిని కేసీఆర్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2.70లక్షలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో నగరంలోనే లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే కేపీ వివేక్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆరు మంచినీటి రిజర్వాయర్‌ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యే స్థాయికి చేరుకున్నాయని, రిజర్వాయర్‌లను ప్రారంభించుకుంటే ఇక ప్రజలకు నీటి కష్టాలు శాశ్వతంగా దూరమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు రావుల శేషగిరి, జగన్, సత్యనారాయణ, ఇంద్రసేనా గుప్త, రామకృష్ణరాజు, రాధాకృష్ణ, సతీశ్, అరుణ, అమృతేశ్వరి, విజయలక్ష్మి, శ్రీకాంత్, శివకుమార్ పాల్గొన్నారు.
26 నుంచి ప్రజాచైతన్య బస్సుయాత్ర
* మాజీమంత్రి సబితా రెడ్డి
చేవెళ్ల, ఫిబ్రవరి 20: కాంగ్రెస్ ఈనెల 26న చేవెళ్ల నుంచి ప్రజాచైతన్య బస్సు యాత్ర ప్రారంభిస్తోందని మాజీ మం త్రి సబితారెడ్డి తెలిపారు. మంగళవా రం మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలో ఉన్న ఖాళీ స్థలాన్ని డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి గోపాల్ రెడ్డి, మొయినాబాద్ మండల అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, షాబాద్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సబిత మాట్లాడుతూ గతంలో దివంగత వైఎస్‌ఆర్ సైతం ప్రతి కార్యక్రమం ఇక్కడ నుంచే మొదలు పెట్టే వారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కి చేవెళ్ల సెంటిమెంట్ కావడంతో మళ్లీ.. అదే తరహాలో బస్సుయాత్ర ప్రారం భిసు తన్నామని చెప్పారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ వెంకటేశం గుప్త, ఏ- బ్లాక్ అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, ప్రధాన కార్యద ర్శి మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ గోపాల్ రెడ్డి, చేవెళ్ల యూత్ అధ్యక్షుడు టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, నేతలు ఆలీ, నాగులు, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.