రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో జోరుగా అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 20: రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులను సక్రమంగా చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
మంగళవారం రాజేంద్రనగర్‌లోని టీసీపార్డులో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇతర ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానానికి తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. మిషన్ భగీరథ పథకంతో ప్రజలకు తాగునీరు, మిషన్ కాకతీయతో రైతులకు సాగునీరు, పేద యువతుల వివాహాలకు కల్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీముబారక్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి అమలుపరుస్తున్నారని గుర్తుచేశారు. నియోజకవర్గాల వారీగా మిషన్ భగీరథ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను పనులను వేగవంతం చేసి ఏప్రిల్ చివరి నాటికి గ్రామాల వరకు నీరు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.