రంగారెడ్డి

ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, ఫిబ్రవరి 20 శంషాబాద్ మండల పరిధిలోని గగన్ పహాడ్ వద్ద హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఆయిల్ కంపెనీలో మంగళవారం రాత్రి ట్యాంకర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో కార్మికులందరూ బయటికి పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్ని మాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ సీఐ మహేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిన్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపారు.

అక్రమాలకు పాల్పడితే చర్యలు
ధారూర్, ఫిబ్రవరి 20: ఉపాధిహామీ ద్వారా కల్పించిన పనులకుగాను కూలి చేసింది ఒరైతే డబ్బులు మరొకరి ఖాతాలో జమ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. మంగళవారం ధారూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధిహామీపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందంర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులు, వాటి వివరాలను వారం రోజులుగా గ్రామాల్లో డిఆర్‌పిలు పరిశీలించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. గ్రామాలవారీగా వివరాలు సమర్పిస్తున్న సమయంలో నాగసమందర్ గ్రామానికి చెందిన పనుల వివరాలు సరిపోలడంలేదని కొన్ని రికార్డులు కూడా అందుబాటులో లేవని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ సహాయ ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. వారం రోజులుగా డిఆర్‌పిలు గ్రామాల్లో చేపట్టిన పనులను, దానికి సంబంధించిన వివరాలను సేకరించారని తెలిపారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారీతనం పెరుగుతుందని ఆన్నారు. మంగళవారం రాత్రి వరకు కొనసాగిన సామాజిక తనిఖీలో జడ్‌పిటిసి రాములు, ఎంపిడిఓ సబిత, జిల్లా విజిలెన్స్ అధికారి అమ్రేష్, డిఆర్‌పి అంజిలయ్యగౌడ్, ఎపిఓ శ్రీనివాస్, టిఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.